Begin typing your search above and press return to search.

ఉత్త‌మ న‌టుడు క‌మ‌ల్..ఉత్త‌మ న‌టి కీర్తిసురేష్!

ఒసాకా త‌మిళ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ పెస్టివ‌ల్ విజేత‌ల‌ను క‌మిటీ ప్ర‌కటించింది.

By:  Tupaki Desk   |   26 May 2024 1:24 PM GMT
ఉత్త‌మ న‌టుడు క‌మ‌ల్..ఉత్త‌మ న‌టి కీర్తిసురేష్!
X

ఒసాకా త‌మిళ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ పెస్టివ‌ల్ విజేత‌ల‌ను క‌మిటీ ప్ర‌కటించింది. ఉత్త‌మ న‌టుడిగా విశ్వ‌న‌టులు క‌మ‌ల్ హాస‌న్..ఉత్త‌మ న‌టిగా అందాల తార కీర్తి సురేష్ నిలిచారు. 2022 చిత్రాల‌కు గాను ఈ అవార్డుల ప్ర‌క‌ట‌న జ‌రిగింది. `విక్ర‌మ్` లో క‌మ‌ల హాస‌న్ నట‌న‌కు.. `సాని కాయితం` అనే సినిమాలో కీర్తిన‌ట‌న‌కు ఈ గుర్తింపు ద‌క్కింది. ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా మ‌ణిర‌త్నం నిలిచారు. పొన్నియ‌న్ సెల్వ‌న్ చిత్రానికి గానూ ఈ అవార్డు వ‌చ్చింది.

అలాగే ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా అనిరుద్ ( విక్ర‌మ్) నిలిచాడు. అత్య‌ధికంగా 8 విభాగాల్లో `విక్ర‌మ్` కు, `పొన్నియ్ సెల్వ‌న్` కి ఏడు విభాగాల్లో అవార్డులు వ‌రించాయి. బెస్ట్ ఎంట‌ర్ టైన‌ర్ గా `ల‌వ్ టుడే` నిలిచింది. జపాన్ దేశంలో ఒసాకా న‌గ‌రంలో ఈ వేడుక జ‌రిగింది. ఇది కోలీవుడ్-జ‌పాన్ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల మ‌ధ్య వార‌ధిగా నిలుస్తోంది. మ‌రికొంత మంది విజేత‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

బెస్ట్ డైరెక్ట‌ర్ ఆఫ్ ఫోటో గ్ర‌ఫీ: ర‌వివ‌ర్మ‌న్( పొన్నియన్ సెల్వ‌న్), బెస్ట్ స్క్రీన్ ప్లే రైట‌ర్స్: ర‌త్న‌కుమార్, లోకేష్ క‌న‌గ‌రాజ్ (విక్ర‌మ్), బెస్ట్ కొరియోగ్ర‌ఫీ: జానీ మాస్ట‌ర్ (అర‌బిక్ కుతు పాట బీస్ట్ నుంచి), బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్: ఐశ్వ‌ర్యా రాయ్( పొన్నియ‌న్ సెల్వ‌న్), బెస్ట్ విల‌న్: విజ‌య్ సేతుప‌తి( విక్ర‌మ్) నిలిచారు. ఇప్ప‌టికే ఉత్త‌మ విల‌న్..విక్ర‌మ్ సినిమాల‌కు వివిధ అవార్డులు...రివార్డులు సొంతం చేసుకుంది. తాజాగా ఒసాకా వేదిక‌పైనా ఈ రెండు సినిమాలు మెర‌వ‌డంతో త‌మిళ ప‌రిశ్ర‌మకి మ‌రింత గుర్తింపు గా మారింది.

ఉత్త‌మ న‌టుడిగా క‌మ‌ల్ హాసన్ ఇప్ప‌టికే ఎన్నో అవార్డులు అందుకున్నారు. దేశ‌-విదేశాల్లో క‌మల్ కి ఎన్నో పుర‌స్కారాలు వ‌రించాయి. అలాగే ఉత్త‌మ న‌టిగా కీర్తి సురేష్ `మ‌హాన‌టి` చిత్రానుకు గాను ప‌లు అవార్డులు అందుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రోసారి ఉత్త‌మ న‌టి అవార్డు అమ్మ‌డికి మ‌రో బూస్టింగ్ లాంటిద‌ని చెప్పొచ్చు.