Begin typing your search above and press return to search.

తండ్రి విష‌యంలో శ్రుతి హాస‌న్ కి ఆ అర్హ‌త లేదా?

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ సినీ ప్ర‌యాణం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌పంచ‌మే మెచ్చిన గొప్ప న‌టుడు

By:  Tupaki Desk   |   17 Jun 2024 5:57 AM GMT
తండ్రి విష‌యంలో శ్రుతి హాస‌న్ కి ఆ అర్హ‌త లేదా?
X

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ సినీ ప్ర‌యాణం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌పంచ‌మే మెచ్చిన గొప్ప న‌టుడు. అందుకే విశ్వ న‌టుడిగా నీరాజ‌నాలు అందుకుంటున్నారు. ఎన్నో సినిమాల్లో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో సినీ రంగంలో త‌న‌దైన ముద్ర వేసారు. న‌ట‌న ఒక్క‌టే అత‌నికి చెల్లిందంటే? కుద‌ర‌దు. ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడిగానూ ఎంతో ఫేమ‌స్ అయ్యారు. ఒకేసారి ప‌ది పాత్ర‌లు..అవ‌తారాల్లో క‌నిపించి రికార్డులు సృష్టించిన ఘ‌న‌త ఆయ‌న సొంతం.

`ద‌శావ‌తారం`, `విశ్వ‌రూపం` లాంటి అద్భుతాలు వ‌చ్చాయంటే? కార‌ణం క‌మ‌ల్ హాస‌న్. మ‌రి అలాంటి లెజెండ‌రీ న‌టుడు బ‌యోపిక్ తీయాలంటే? తీయ‌డానికి కొన్ని అర్హ‌త‌లుండాలి. క‌మ‌ల్ జీవితాన్ని ఎంతో ద‌గ్గ‌ర‌గా చూసి ఉండాలి. ద‌ర్శ‌కుడిగా ఎన్నో సినిమాల‌కు ప‌నిచేసి ఉండాలి. అత‌డి పాత్ర‌లో ఆత్మ‌ని ప‌ట్టుకోగ‌ల‌గాలి. అందుకేనేమో ఆ బాధ్య‌త‌మాత్రం తాను నెత్తిన వేసుకోలేని బ‌హిరంగంగానే చెప్పేసింది కుమార్తె శ్రుతి హాస‌న్.

డాడ్ లాగే డాట‌ర్ కూడా మ‌ల్లీ ట్యాలెండెడ్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో కమ‌ల్ బ‌యోపిక్ మీరు చేస్తారా? అంటే అందుకు త‌న‌కు అర్హ‌త లేద‌ని చెప్పేసింది. `నేను స‌రైన ఛాయిస్ కాదు. ఆయ‌న బ‌యోపిక్ చేయ‌డానికి ఎంతో అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కులు లైన్ లో ఉన్నారు. వాళ్లు మాత్ర‌మే నాన్న జీవితానికి న్యాయం చేయ‌గ‌ల‌రు. ఆయ‌న గురించి పూర్తిగా తెలిసిన వ్య‌క్తులు తీస్తే మ‌రింత గొప్ప‌గా సినిమా వ‌స్తుంది.

ఆయ‌న జీవితంలో ఎంతో ఎమోష‌న్ ఉంది. బ‌యోపిక్ ల‌కు కావాల్సింది ఆ పాయింట్. దాన్నే ఏ ద‌ర్శ‌కు డు గొప్ప‌గా చూపిస్తారో? వాళ్లే విజేత‌లు` అని అంది. ప్ర‌స్తుతం శ్రుతి హాస‌న్ కోలీవుడ్ లో పుల్ బిజీగా ఉంది. అలాగే తెలుగులోనూ మంచి అవ‌కాశాలు వస్తున్నాయి. గ‌త ఏడాది `స‌లార్` తో భారీ విజ‌యం అందుకుంది. `స‌లార్ -2` ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుందా? అని ఎదురు చూస్తోంది.