Begin typing your search above and press return to search.

కమల్ అంత తొందరగా ఏమి తెగ్గొట్టలేదు..!

నాగ్ అశ్విన్ కథ బాగా చెప్పాడు కానీ చెప్పినట్టుగా తీస్తాడా లేదా అన్న ఆలోచనతో కాస్త టైం తీసుకున్నా అంతేకాదు తను ఆల్రెడీ నెగిటివ్ రోల్ లో పాత్రలు చేశా ఇందులో కొత్తగా ఏముంటుంది అనుకున్నా

By:  Tupaki Desk   |   25 Jun 2024 6:51 AM GMT
కమల్ అంత తొందరగా ఏమి తెగ్గొట్టలేదు..!
X

ప్రభాస్ నటించిన కల్కి సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా గురించి ఆడియన్స్ లో మరింత అంచనాలు పెంచేలా మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా బుకింగ్స్ ఓపెన్ అవ్వగా అన్నిచోట్ల దాదాపు భారీగా సేల్స్ మొదలయ్యాయి. ఇక మరోపక్క కల్కి టీం ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన చాలా విషయాలు వెల్లడించారు. అమితాబ్ హోస్ట్ గా నిర్వహించిన ఈ స్పెషల్ చిట్ చాట్ లో సినిమా గురించి తమ అనుభవాలను కల్కి కాస్టింగ్ పంచుకున్నారు.

ముఖ్యంగా కమల్ హాసన్ ఈ సినిమాలో నటించడం గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. కల్కి సినిమాలో ప్రభాస్, అమితాబ్ ల తర్వాత మరో హైలెట్ గా చెప్పుకునే అంశం కమల్ హాసన్. అసలు ఇలాంటి ఒక ప్రాజెక్ట్ లో కమల్ ఉంటున్నాడు అంటేనే ఆడియన్స్ లో ఒక క్యూరియాసిటీ ఏర్పడుతుంది. కల్కి సినిమాలో కమల్ సుప్రీం యాస్కిన్ పాత్రలో నటించారు. సినిమాలో కమల్ నెగిటివ్ రోల్ లో కనిపిస్తారు. ట్రైలర్ లో ఆయన లుక్ చూసి అందరు అవాక్కయ్యారు.

ఐతే కల్కి సినిమాలో యాక్సిన్ పాత్రను ఒప్పుకునేందుకు దాదాపు ఏడాది దాకా టైం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. నాగ్ అశ్విన్ కథ బాగా చెప్పాడు కానీ చెప్పినట్టుగా తీస్తాడా లేదా అన్న ఆలోచనతో కాస్త టైం తీసుకున్నా అంతేకాదు తను ఆల్రెడీ నెగిటివ్ రోల్ లో పాత్రలు చేశా ఇందులో కొత్తగా ఏముంటుంది అనుకున్నా కానీ కల్కిలో చేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు కమల్.

మరోపక్క అమితాబ్ కూడా ఈ సినిమాలో భాగం అయినందుకు గొప్ప అనుభూతి కలిగిందని.. ఈ సినిమా కథ చెప్పినప్పుడు నాగ్ అశ్విన్ ఏం తింటాడు.. ఇంత మంచి కథ రాయడానికి ఎలా ఆలోచిస్తాడని అనుకున్నానని చెప్పారు. అంతేకాదు కల్కిలో విజువల్స్ అనేవి నమ్మడానికి వీలు లేనివిధంగా అద్భుతంగా తెరకెక్కించారని కితాబు ఇచ్చారు అమితాబ్. కల్కి పై చిత్ర యూనిట్ చేసిన ఈ స్పెషల్ చిట్ చాట్ చూసిన ఆడియన్స్ సినిమా కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని ఫిక్స్ అయ్యారు. ప్రభాస్ స్టామినా ఏంటన్నది మరోసారి కల్కి కలెక్షన్స్ తో ప్రూవ్ చేయబోతున్నాయి. తెలుగు రెండు రాష్ట్రాలు.. పాన్ ఇండియా వైడ్ మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా కల్కి మేనియా ఒక రేంజ్ లో ఉంది. ప్రీ బుకింగ్స్ లోనే రికార్డులు కొడుతున్న కల్కి ఫస్ట్ డే కచ్చితంగా నెవర్ బిఫోర్ రికార్డులను క్రియేట్ చేసేలా ఉందని చెప్పొచ్చు.