Begin typing your search above and press return to search.

క‌మ‌ల్‌ ప్ర‌శ్న‌.. ఒక త‌మిళుడు దేశాన్ని ఎందుకు పాలించ‌లేడు?

ఇటీవల చెన్నైలో జరిగిన `ఇండియన్ 2` ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నటుడు-రాజకీయ నాయకుడు కమల్ హాసన్ శక్తివంతమైన ప్రసంగం చేశారు

By:  Tupaki Desk   |   3 Jun 2024 2:56 PM GMT
క‌మ‌ల్‌ ప్ర‌శ్న‌.. ఒక త‌మిళుడు దేశాన్ని ఎందుకు పాలించ‌లేడు?
X

ఇటీవల చెన్నైలో జరిగిన `ఇండియన్ 2` ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నటుడు-రాజకీయ నాయకుడు కమల్ హాసన్ శక్తివంతమైన ప్రసంగం చేశారు. ఒక తమిళుడు దేశాన్ని ఎందుకు పాలించలేడు? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇలా ప్ర‌శ్నించిన మొద‌టి ద‌క్షిణాది న‌టుడు నాయ‌కుడు కూడా ఆయ‌నే! ఈ వేడుక‌కు శంక‌ర్, శింబు, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, అనిరుధ్ రవిచందర్ స‌హా ఇతర చిత్ర‌బృందం హాజరయ్యారు.

విభజించు పాలించు అన్నది బ్రిటీష్ కాలం నాటి నానుడి అని.. వారు భారతదేశాన్ని విడిచిపెట్టినందున.. వారి ఆలోచనలకు అది సమయం అని క‌మ‌ల్‌హాస‌న్ అన్నారు. దేశం ఐక్యత కోసం పాటుపడాలని కూడా క‌మ‌ల్ అభిల‌షించారు. నేను తమిళుడిని.. పైగా భారతీయుడిని.. అది నా గుర్తింపు .. నీది కూడా!! సీక్వెల్స్ వెనుక ఉన్న కాన్సెప్ట్ అది అని తెలిపారు. ``విభజించి పాలించు అనేది బ్రిటిష్ వారి భావన. వారు తిరిగి వెళ్ళడానికి ఇల్లు ఉన్నందున ఇది అప్పట్లో పనిచేసింది. ఇది ఇక పని చేయదు. ఈ రోజు అదే చేయాలని ప్రయత్నిస్తున్న వారు ఎక్కడికి వెళతారో అని నేను ఆశ్చర్యపోతున్నాను`` అని క‌మ‌ల్‌ హాసన్ అన్నారు.

తమిళ రాజకీయ నాయకులు దేశాన్ని పాలించాలనే తన కల గురించి క‌మ‌ల్ బ‌హిరంగ వేదిక‌పై ఓపెన‌య్యారు. ప్రతి ఊరు నీ నగరమే.. అందరూ నీ బంధువులే. మన రాష్ట్రానికి వచ్చిన వారికి ప్రాణదానం చేయడంలో పేరుగాంచారు. ఒక తమిళుడు దేశాన్ని పాలించే రోజు ఎందుకు రాకూడదు? ఇది నా దేశం .. దానిలోని ఐక్యతను మనం కాపాడుకోవాలి.. అని ఉద్విగ్న‌మైన ప్ర‌సంగంతో ఈవెంట్ ని క‌మ‌ల్ ర‌క్తి క‌ట్టించారు.

కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 (భార‌తీయుడు 2) జూలై 12న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ప్రియా భవానీ శంకర్, కాళిదాస్ జయరామ్, సముద్రఖని, బాబీ సింహా, జార్జ్ మారియన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. భారతీయుడు 2 , భార‌తీయుడు 3 అనే రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండియన్ 3 వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది.