Begin typing your search above and press return to search.

సూప‌ర్‌మేన్ వ‌య‌సెంత అని ఎవ‌రైనా అడుగుతారా?

ఇంత‌లోనే కమల్ హాసన్ ఇప్పుడు ఇండియన్ 2 (హిందీలో హిందుస్తానీ 2) విడుద‌ల స‌న్నాహ‌కాల్లోకి షిఫ్ట‌య్యారు

By:  Tupaki Desk   |   30 Jun 2024 1:30 AM GMT
సూప‌ర్‌మేన్ వ‌య‌సెంత అని ఎవ‌రైనా అడుగుతారా?
X

ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్ వ‌రుస‌గా భారీ ప్రాజెక్ట్‌లలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవల విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకున్న‌ `కల్కి 2898 AD`లో తన పాత్ర‌కు అద్భుత స్పందన వ‌చ్చింది. క‌ల్కి పార్ట్ 2లో క‌మ‌ల్ హాస‌న్ విశ్వ‌రూపం చూపించేందుకు ఆస్కారం ఉంద‌న్న అంచ‌నాలు వెలువ‌రించారు క్రిటిక్స్. విమర్శకులు, సినీ ప్రేమికులు, సినీ సోదరుల నుంచి గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ఇంత‌లోనే కమల్ హాసన్ ఇప్పుడు ఇండియన్ 2 (హిందీలో హిందుస్తానీ 2) విడుద‌ల స‌న్నాహ‌కాల్లోకి షిఫ్ట‌య్యారు. అత‌డి నుంచి తదుపరి భారీ చిత్రం త్వరలో గ్రాండ్ రిలీజ్ కానుంది. తాజాగా పింక్‌విల్లాతో ఇంటరాక్టివ్ మాస్టర్‌క్లాస్ సెషన్ లో ఒక చిక్కు ప్ర‌శ్న‌కు క‌మ‌ల్ తగిన సమాధానం ఇచ్చారు.

ఇండియన్-2లో సేనాపతి అసలు వయస్సు గురించి నెటిజన్లు ప్రశ్నిస్తున్నారని హోస్ట్ కమల్ హాసన్‌ను ప్ర‌శ్నించ‌గా...``వీళ్లే ఇబ్బందికరమైన అబ్బాయిలు.. మేం తప్పించుకోవడానికి ఇష్టపడతాం. అయితే నా వద్ద ఎవరూ వయస్సు అడగని సమాధానం ఉంది. సూపర్‌మ్యాన్ లేదా హనుమాన్..`` అని అన్నారు.

హిందీ వెర్షన్‌ హిందుస్తానీ 2 .. తెలుగు వెర్షన్‌ భారతీయుడు 2 టైటిల్స్ తో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రానికి సుభాస్కరన్ అల్లిరాజా సార‌థ్యంలోని లైకా ప్రొడక్షన్స్ పెట్టుబ‌డుల్ని స‌మ‌కూర్చింది. ఉద‌య‌నిధి స్టాలిన్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఈ చిత్రం వరుసగా తమిళం, తెలుగు, హిందీ భాషలలో 12 జూలై 2024న థియేటర్లలో విడుదల కానుంది. ఈ ఇంట‌ర్వ్యూ ముగింపులో క‌మ‌ల్ డైలాగ్ ఆస‌క్తిని క‌లిగించింది. అతను ప్రతిచోటా ఉంటాడు.. అతడు యుగాలు దాటి వస్తాడు.. అందుకే మీరు అతన్ని దేవుళ్ళలా ఎక్కువ కాలం జీవించేవాడిగా చూస్తారు! అని చెబుతూ ఇంట‌ర్వ్యూ ముగించారు.

ఇండియన్-2 గురించి..

1996లో విడుదలైన భారతీయుడు చిత్రంలో కమల్ హాసన్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. తండ్రి తన దేశంలో అవినీతిని ఎదిరించేవాడిగా విప్లవకారుడిగా కనిపించాడు. ఇండియన్ 2 దానికి మునుపు ఏం జ‌రిగింద‌నేది తెర‌పై ఆవిష్క‌రిస్తుంది. ఇది ప్రీక్వెల్ క‌థ‌తో రూపొందింది. క‌మ‌ల్ హాస‌న్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్ త‌దిత‌రులు న‌టించారు. దివంగత నటులు వివేక్ - నేదురుముడి వేణుల‌ను ఇందులో చూపిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించ‌గా..శంక‌ర్ తెర‌కెక్కించారు.