Begin typing your search above and press return to search.

త‌ప్పించుకోవ‌డానికి ఫీజు పెంచాన‌న్న‌ క‌మ‌ల్‌హాస‌న్

ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మల్ హాసన్ 28 ఏళ్ల తర్వాత భారతీయుడు ఫ్రాంచైజీతో తిరిగి వస్తున్నారు. భారతీయుడు 2లో క‌మ‌ల్ తిరిగి సేనాప‌తిగా న‌టించారు

By:  Tupaki Desk   |   27 Jun 2024 1:30 AM GMT
త‌ప్పించుకోవ‌డానికి ఫీజు పెంచాన‌న్న‌ క‌మ‌ల్‌హాస‌న్
X

ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మల్ హాసన్ 28 ఏళ్ల తర్వాత భారతీయుడు ఫ్రాంచైజీతో తిరిగి వస్తున్నారు. భారతీయుడు 2లో క‌మ‌ల్ తిరిగి సేనాప‌తిగా న‌టించారు. అవినీతిప‌రుల గుండెల్లో బాకు దించ‌నున్నారు. అయితే భార‌తీయుడు 2 హిందీ వెర్షన్ హిందుస్తానీ 2 ట్రైలర్ లాంచ్‌లో కమల్ చెప్పిన మాట‌లు అవాక్క‌య్యేలా చేయాయి. తాను 1996 లో భార‌తీయుడు ప్ర‌పోజ‌ల్ వ‌చ్చిన‌ప్పుడు ఈ చిత్రంలో తాను భాగం కావాలనుకోలేదని క‌మ‌ల్ తెలిపారు. ఎంతగా అంటే అతడు S శంకర్ తనంతట తానుగా వెళ్లిపోతాడని ఆశతో తన ఫీజు(పారితోషికం)ను పెంచాడు. కానీ నిర్మాతలు అత‌డు అడిగినంతా ఇచ్చేందుకు అంగీక‌రించి ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుల్లా క‌నిపించారు.. క‌మ‌ల్ ని వ‌దులుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు.

ఇప్పుడున్న శంకర్ ఆనాడే అనుభవ‌జ్ఞుడిలా క‌నిపించాడని క‌మ‌ల్ అన్నారు. ``అత‌డిలో మొదటి సినిమాలోనే ఆ లక్షణాలను చూశాను. అతను చాలా నమ్మకంగా ఉన్నాడు. వాస్తవానికి నేను సినిమా చేయడానికి పెద్దగా ఇష్టపడలేదు.. ఎందుకంటే నాకు మరొక ఆఫర్ అచ్చం ఇలాంటిదే ఉంది. నటీనటులకు ఈ సమస్య ఉంది.. మేక‌ర్స్ సినిమా చేయాలనుకుంటున్నారు. అందుకే డైరెక్ట‌ర్ ఎప్పుడూ చలించలేదు. కాబట్టి నేను నా ఫీజును పెంచాను.. కానీ నిర్మాత కదలలేదు. నేను సినిమా తీస్తే ఈ పెద్దమనిషితోనే చేస్తానని దర్శకుడు చెప్పారని, ఆయన చాలా తెలివిగల, అనుభవజ్ఞుడైన దర్శకుడిలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారని నిర్మాత చెప్పాడు. ఇది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది`` అని కమల్ అన్నారు.

భారతీయుడు 2 పార్ట్ 1తో కనెక్ట్ అయిన క‌థ‌తో రూపొందింద‌ని శంకర్, కమల్ కూడా ధృవీకరించారు. భారతీయుడు 2 లో కమల్ సేనాపతిగా తిరిగి బ‌రిలో దిగుతున్నారు. అవినీతి అవ్య‌వ‌స్థ‌పై పోరాటం సాగిస్తాడు సేనాప‌తి. అయితే ఈ చిత్రంలో కొత్తత‌రం నటీనటులు నటిస్తున్నారు. ఇండియన్ 2లో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రాహుల్ ప్రీత్ సింగ్, సముద్రఖని, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్ త‌దిత‌రులు న‌టించారు. శంకర్ ఈ సీక్వెల్లో ఇప్ప‌టికే దివంగ‌తులైన‌ నటులు వివేక్, నేదురుమూడి వేణులను తెరపైకి తీసుకురావడానికి CGI - బాడీ డబుల్స్‌ను కూడా ఉపయోగించారు.

ట్రైలర్ లాంచ్‌లో కమల్ ఇండియన్ 2 కోసం పెరుగుతున్న బడ్జెట్ గురించి కూడా మాట్లాడారు. కోవిడ్ -19 మహమ్మారి , సెట్స్‌లో దురదృష్టవశాత్తు మరణాలు, చిత్రీకరణ డిలే వంటివి విడుదలలో జాప్యం కలిగించాయని పేర్కొన్నాడు. ఎన్ని జ‌రిగినా దర్శకుడు ఎస్ శంకర్ స్థిరంగా నిలిచిన‌ లైకా ప్రొడక్షన్స్‌ను ప్రశంసించారు. భారతీయుడు 2 జూలై 12న విడుదల కానుంది. ఈ చిత్రం అక్షయ్ కుమార్ సర్ఫిరాతో ఢీకొంటుంది.