Begin typing your search above and press return to search.

వీడియో : లోక నాయకుడి 'కల్కి' విజయానందం

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన కల్కి సినిమా మూడు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది

By:  Tupaki Desk   |   16 July 2024 9:35 AM GMT
వీడియో : లోక నాయకుడి కల్కి విజయానందం
X

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన కల్కి సినిమా మూడు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే వెయ్యి కోట్ల వసూళ్ల మార్క్‌ ను క్రాస్ చేసిన కల్కి సినిమా రాబోయే రెండు వారాల్లో సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సినిమాలో నటించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు అంతా కూడా ప్రస్తుతం సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో కల్కి మేకింగ్‌ కు సంబంధించిన ముచ్చట్లతో ఎంతో మంది నటీనటులు సినిమాకు పోస్ట్‌ ప్రమోషన్‌ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

తాజాగా యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ కల్కి సినిమా పోస్ట్‌ ప్రమోషన్ లో భాగంగా ఒక వీడియోను రిలీజ్‌ చేయడం జరిగింది. ఆ వీడియో లో కల్కి సినిమా ముచ్చట్లతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 250 సినిమాలు చేసిన తనకు కల్కి సినిమా కు వచ్చిన స్థాయిలో మరే సినిమాకు కాల్స్ రాలేదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు.

యాస్కిన్‌ పాత్ర గురించి దర్శకుడు చేసిన హోం వర్క్ గురించి చెప్పుకొచ్చాడు. నాగ్‌ అశ్విన్‌ ఉలి తీసుకు వస్తే, నేను సుత్తిని తెచ్చాను. ఇద్దరం కలిసి సుప్రీం యాస్కిన్ అనే బొమ్మను చెక్కాం. తక్కువ స్క్రీన్‌ టైమ్‌ ఉన్నా కూడా కావాల్సినంత ప్రాముఖ్యత పాత్ర కు ఉందని కమల్‌ అన్నాడు.

ఈ సినిమా కోసం ఇండియాస్ బిగ్గెస్ట్‌ యాక్టర్స్ నటించారు. వారందరితో నాగ్‌ అశ్విన్‌ చేయించిన తీరు అద్భుతం. నాగ్‌ అశ్విన్‌ కి మా గురువు గారు సింగీతం శ్రీనివాస్ గారి లాంటి చిన్న పిల్లల గుణం ఉంది. దాన్ని ఆయన కొనసాగించుకుంటే భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన సినిమాలను చేస్తాడు అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.