ఉలగనాయగన్ స్టైల్‌కి విజిల్స్ వేయాల్సిందే
ఉలగనాయగన్ కమల్ హాసన్ ఏం చేసినా అది ఎదుటివారు అసూయ పడేలా ఉంటుంది. ప్రయోగాల్లో ఆయనకు ఆయనే సాటి
By: Tupaki Desk | 19 Nov 2023 9:10 AM GMTఉలగనాయగన్ కమల్ హాసన్ ఏం చేసినా అది ఎదుటివారు అసూయ పడేలా ఉంటుంది. ప్రయోగాల్లో ఆయనకు ఆయనే సాటి. సినీ జగత్తును విశ్వనటుడిగా ఏలారు. కేవలం తమిళం, సౌత్ వరకే ఆయన పరిమితం కాదు. 90లలో బాలీవుడ్ లో అడుగుపెట్టిన కమల్ హాసన్ అప్పట్లో అక్కడి అగ్ర హీరోలందరికీ ఠఫ్ కాంపిటీటర్ గా మారారు. ఆయన జీవితాన్ని పూర్తిగా నటన, సినీరంగానికే అంకితమిచ్చారు. ఇన్నేళ్లలో ఆయన సాధించని ఘనత లేదు. జాతీయ ఉత్తమ నటుడిగా సంచలనాలు సృష్టించారు కమల్.
ఇప్పుడు 69వయసులో ఆయన స్టైల్ ఎలివేషన్ చూస్తుంటే మరోసారి కమల్ ఈజ్ బ్యాక్ అంటూ విజిల్స్ వేయడం ఖాయం. అంతగా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు ఈ కొత్త లుక్ లో. తన ఇన్‌స్టాగ్రామ్‌లో కమల్ హాసన్ ఒక అద్భుతమైన ఫోటోని షేర్ చేసారు. 'ప్లే ఆన్!!' అని దీనికి వ్యాఖ్యను జోడించారు.
కమల్ కార్గోలో పూర్తిగా ఐకానిక్ ఫ్యాషనిస్టాను తలపిస్తున్నారు. రిబ్బెడ్ స్వెట్ షర్ట్.. లేత గోధుమరంగు కార్గో ధరించిన కమల్ హాసన్ సూటబుల్ జాకెట్‌ను ధరించి పియానో పక్కన పోజులిచ్చారు. ఆ సమయంలో స్టైలిష్ గాగుల్స్‌తో ఎంపరర్ లా కనిపిస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. కమల్ హాసన్ అందరూ అసూయపడే అద్భుత సినిమాల లైనప్ తో దూసుకొస్తున్నారు. ఇవి రాబోవు రెండేళ్లలో థియేటర్లలోకి వస్తాయి. కమల్ నటిస్తున్న హైలైట్ విజిలెంట్ డ్రామా ఇండియన్ 2 కి శంకర్ దర్శకుడు. ప్రభాస్- దీపికా పదుకొనేలతో కలిసి 'కల్కి 2898 AD'లో నటిస్తుండగా ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. మణిరత్నంతో మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా అయిన థగ్ లైఫ్ - మిలిటరీ బ్యాక్‌డ్రాప్‌లో హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న మరో యాక్షన్ డ్రామా చిత్రీకరణ దశలో ఉన్నాయి.