Begin typing your search above and press return to search.

ఆ స్టార్స్ ఇద్ద‌రు డెడ్ స్లోగా..రిలీజ్ ఇప్ప‌ట్లో క‌ష్ట‌మే!

ఇద్ద‌రు మరోసారి అద్భుత‌మే చేస్తున్నారనే అంచ‌నాలు పీక్స్ కి చేరుతున్నాయి.

By:  Tupaki Desk   |   19 July 2024 5:18 AM GMT
ఆ స్టార్స్ ఇద్ద‌రు డెడ్ స్లోగా..రిలీజ్ ఇప్ప‌ట్లో క‌ష్ట‌మే!
X

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస్ క‌థానాయ‌కుడిగా మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల మ‌ధ్య 'థ‌గ్ లైఫ్' తెర‌క‌రెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. మూడున్న‌ర ద‌శాబ్దాల త‌ర్వాత ఈ కాంబినేష‌న్ లో సినిమా రావ‌డంతో అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి. గ్యాంగ్ స్ట‌ర్ నేప‌థ్యంతో తెర‌కెక్కుతోన్న సినిమాలో క‌మ‌ల్ లుక్ ఇప్ప‌టికే అభిమానుల్లో కాక పుట్టిస్తోంది. ఇద్ద‌రు మరోసారి అద్భుత‌మే చేస్తున్నారనే అంచ‌నాలు పీక్స్ కి చేరుతున్నాయి.

తాజాగాఈ సినిమా షూటింగ్ స‌గం పూర్త‌యింది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టిం చింది. మిగ‌తా స‌గం పూర్త‌వ్వ‌డానికి మ‌రో ఆరు నెల‌లకు పైగా స‌మ‌యం ప‌ట్టే అవకాశం ఉంది. అంటే షూటింగ్ నెమ్మ‌దిగా జ‌రుగుతున్న‌ట్లే క‌నిపిస్తుంది. జ‌న‌వ‌రిలోనే ఈ సినిమా ప‌ట్టాలెక్కింది. స‌గం పూర్త‌వ్వ డానికి ఏడు నెల‌లు ప‌ట్టింది. బ్యాలెన్స్ షూట్ లో ఇంకా కీల‌క‌మైన షెడ్యూల్స్ ఎన్నో ఉన్నాయి.

అవ‌స‌రం మేర రీ షూట్ కూడా ఉంటుంది. అటుపై పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌వ్వ‌డానికి ఎలా లేద‌న్నా రెండు..నుంచి మూడు నెల‌లు స‌మ‌యం ప‌డుతుంది. అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేది 2025 మిడ్ లోనేన‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ఈ చిత్రాన్ని ఇదే ఏడాది రిలీజ్ చేసే అవ‌కాశం ఉంద‌ని చిత్ర వ‌ర్గాల నుంచి వినిపించింది. సెప్టెంబ‌ర్ లోనే రిలీజ్ అనుకున్న‌ట్లు నెట్టింట ప్ర‌చారం సాగింది.

కానీ ఇది జ‌రిగేది కాద‌ని తాజా అప్ డేట్ ని బ‌ట్టి తెలుస్తోంది. సినిమా అంతా బాగా వ‌స్తుంద‌ని, స‌గం షూటిం గ్ పూర్త‌యింద‌ని..పెండింగ్ కూడా పూర్తి చేసిన త‌ర్వాత రిలీజ్ తేదీ ప్ర‌క‌టిస్తామ‌ని నిర్మాత‌ల్లో ఒక‌రైన శివ అనంత్ రివీల్ చేసారు. ఇందులో క‌మ‌ల్ కి జోడీగా త్రిష న‌టిస్తోంది. రంగ‌రాయ శ‌క్తివేల్ నాయ‌క‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇంకా జ‌యం ర‌వి, శింబు, దుల్క‌ర్ స‌ల్మాన్, నాజ‌ర్, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.