Begin typing your search above and press return to search.

కమల్ అమ్మకం సరే.. కొనేవాడు సాటిస్ఫై అవ్వాలి కదా..?

లోకనాయకుడు కమల హాసన్ నటన ఆయన చేసిన పాత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే

By:  Tupaki Desk   |   9 July 2024 3:30 PM GMT
కమల్ అమ్మకం సరే.. కొనేవాడు సాటిస్ఫై అవ్వాలి కదా..?
X

లోకనాయకుడు కమల హాసన్ నటన ఆయన చేసిన పాత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే. పాత్రకు పరిపూర్ణత తెచ్చే నటుల్లో ఆయన కూడా ఒకరు. కొన్నాళ్లుగా సరైన ఫాం లో లేని కమల్ హాసన్ లోకేష్ విక్రం సినిమాతో సూపర్ కంబ్యాక్ ఇచ్చేలా చేశాడు. విక్రం సినిమా ఇచ్చిన సూపర్ హిట్ తో కమల్ తన సూపర్ జోష్ కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా సెట్స్ మీద ఉన్న ఇండియన్ 2 ని ముగించి త్వరలో రిలీజ్ చేస్తున్నారు.

శంకర్ డైరెక్షన్ లో పాతికేళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కింది. జూన్ 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ట్రైలర్ మీద కొన్ని డౌట్లు ఉన్నా శంకర్ మేకింగ్ మాత్రం ఫస్ట్ క్లాస్ అనిపించింది. ఐతే రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమల్ హాసన్ తానొక నటుడిని తన సినిమాను అమ్ముకోవడానికి ఏమాత్రం సిగ్గు పడనని అన్నారు. మార్కెట్ లోకి ఇండియన్ 2 సినిమా వచ్చింది. దాన్ని మీరు చూడండి అని అన్నారు. సినిమాను అమ్మడంలో నటుడిగా నేనొక సేల్స్ మెన్ ని అని చెప్పుకొచ్చారు.

ఐతే సినిమాను అమ్మడం వరకు ఓకే.. నటుడిగా తను చేసిన సినిమాకు టికెట్స్ తెగడానికి కచ్చితంగా కృషి చేయాల్సి ఉంటుంది. కానీ అలా కమల్ ని నమ్మి సినిమాకు వెళ్లి చూసి మోసపోతే ఒకవేళ సినిమా చూసి సాటిస్ఫై కాకపోతే అప్పుడు పరిస్థితి ఏంటన్నది ఆలోచించాలి. నటుడు, దర్శకుడు తను తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అనేట్టుగానే చెబుతారు. కానీ టికెట్ ని వందలు, వేలు పెట్టి కొని చూసే ప్రేక్షకుడికి అది నచ్చాల్సి ఉంటుంది. కమల్ చెప్పిన సేల్స్ మెన్ థియరీ బాగున్నప్పటికీ అది వస్తువు కొనే ప్రేక్షకుడి అభిరుచిని బట్టి కూడా స్వయం తృప్తి ఉంటుందని చెప్పొచ్చు.

కమల్ హాసన్ మాత్రం ఆయన ఏ సినిమా చేసిన 100కి 1000 శాతం ఇచ్చేస్తారు. ఈమధ్యనే వచ్చిన కల్కి సినిమాలో కూడా కమల్ చేసిన సుప్రీం యాస్కిన్ పాత్ర అదిరిపోయింది. సినిమాలో ఆ పాత్ర ఇంకొద్దిసేపు ఉంటే బాగుండు అనిపించింది. ఐతే కమల్ హాసన్ ఆ సినిమాలో తన పాత్ర తక్కువగా ఉందని అంటూ వచ్చిన కామెంట్స్ కి సమాధానం ఇస్తూ సినిమా అనేది అందరు కలిసి చేసేది. అందులో కనిపించేది కమల్ హాసన్ కాదు సుప్రీం యాస్కిన్ ఆయనకు అంతే ప్రాధాన్యత ఉందని ఆ కామెంట్స్ కి ఆన్సర్ ఇచ్చారు. సో సినిమాను కమల్ చూసే విధానం వేరుగా ఉంటుంది. అది సాధారణ ప్రేక్షకుడికి అర్థం కావాల్సిన అవసరం లేదు.