Begin typing your search above and press return to search.

ఇప్పుడు ఆ విషయం వద్దన్న కమల్‌..!

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ 2 సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది.

By:  Tupaki Desk   |   21 Jun 2024 6:03 AM GMT
ఇప్పుడు ఆ విషయం వద్దన్న కమల్‌..!
X

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ 2 సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. జులై మొదటి వారం నుంచి ఇండియన్ 2 ప్రమోషనల్‌ ఈవెంట్స్ మొదలు అవ్వబోతున్నట్లుగా శంకర్ టీం నుంచి సమాచారం అందుతోంది.

ఈలోపు కమల్‌ హాసన్‌ తాను ముఖ్య పాత్రలో నటించిన కల్కి 2898 ఏడీ సినిమా ప్రమోషన్ లో పాల్గొంటున్నాడు. ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి సినిమా మరో అయిదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

కల్కి ప్రమోషన్ లో భాగంగా ముంబైలో భారీ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో కమల్‌ హాసన్ కూడా పాల్గొన్నాడు. ఆ సమయంలో ఒక జర్నలిస్ట్‌ ఇండియన్ 2 గురించి ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. వెంటనే కమల్‌ హాసన్ ప్రస్తుతం ఆ విషయాలు వద్దు అన్నట్లుగా సున్నితంగా వారించాడు.

ఇండియన్‌ 2 సినిమా గురించి మాట్లాడే సమయం కాదు. ముందు ముందు ఆ సినిమా గురించి చాలా వేదికల నుంచి మాట్లాడబోతున్నాను. ప్రస్తుతానికి కల్కి గురించి తప్ప మరే విషయాలను తనను అడగవద్దు అన్నట్లుగా జర్నలిస్ట్‌ లతో ఆఫ్‌ ది రికార్డ్‌ కమల్‌ హాసన్‌ అన్నట్లుగా సమాచారం అందుతోంది.

కల్కి సినిమాలో చిన్న పాత్రలో నటించిన కమల్‌ హాసన్ పూర్తి స్థాయి ప్రమోషనల్‌ ఈవెంట్స్ లో పాల్గొనడం అభినందనీయం అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనిపించేది కొద్ది సమయంలో అయిన కూడా కల్కి లో కమల్‌ హాసన్ పాత్ర చాలా స్పెషల్‌ అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.

చాలా ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు ఇండియన్ 2 సీక్వెల్‌ అనే విషయం తెల్సిందే. అయిదు ఏళ్లుగా సాగుతూ వస్తున్న ఇండియన్‌ 2 ఎట్టకేలకు విడుదలకు సిద్ధం అయ్యింది. వెయ్యి కోట్ల వసూళ్లు టార్గెట్‌ తో ఇండియన్‌ 2 బాక్సాఫీస్ వద్ద బరిలో దిగబోతుంది.