Begin typing your search above and press return to search.

భారతీయుడు 2.. ఏదో ప్లాన్ చేసే ఉంటారు

అదే జరిగితే మాత్రం ఫ్యాన్స్ కి కచ్చితంగా సర్ ప్రైజ్ గా ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ ని ముసలాడిగా చూపించడం కోసం ప్రత్యేకమైన మేకప్ వాడారు.

By:  Tupaki Desk   |   26 May 2024 7:27 AM GMT
భారతీయుడు 2.. ఏదో ప్లాన్ చేసే ఉంటారు
X

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం భారతీయుడు 2. ఈ మూవీ జులై 12న పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది. 28 ఏళ్ళ క్రితం శంకర్, కమల్ కలయికలో భారతీయుడు మూవీ వచ్చింది. ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. శంకర్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా భారతీయుడు మూవీ నిలిచింది.

ఆ చిత్రంలో కమల్ హాసన్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ పోషించాలని. సుభాష్ చంద్రబోస్ తో పాటు స్వాతంత్ర్య ఉద్యమంలో సేనాపతి పాల్గొంటాడు. సమాజంలో జరిగే అవినీతి, లంచగొండితనంపై విసిగిపోయిన సేనాపతి ఎదురుతిరిగి పోరాటం చేయడం భారతీయుడు చిత్రంలో చూపించారు. ఈ సినిమాలో సేనాపతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా కీలకంగా ఉంటుంది.

28 ఏళ్ళ తర్వాత భారతీయుడు 2 చిత్రాన్ని మొదటి మూవీకి కొనసాగింపుగా శంకర్ తెరకెక్కించారు. సేనాపతి పాత్రలో కమల్ హాసన్ ఈ చిత్రంలో సమాజంపై పోరాటం చేయబోతున్నాడు. ఆరంభంలో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయిన ప్రస్తుతం మాత్రం మంచి బజ్ క్రియేట్ అవుతోంది. కమల్ హాసన్ నుంచి విక్రమ్ లాంటి సూపర్ హిట్ తర్వాత ఈ మూవీ వస్తోంది. శంకర్ కూడా చాలా పకడ్బందీగా భారతీయుడు 2 చిత్రాన్ని తెరకెక్కించారు.

అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. దానిని కమల్ హాసన్ పైన చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ లిరిక్స్ బట్టి సేనాపతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే సిచువేషన్ పాట అయ్యుంటదనే మాట వినిపిస్తోంది. ఈ సినిమాలో కూడా యంగ్ సేనాపతి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ని శంకర్ ఆవిష్కరించి ఉండొచ్చని భావిస్తున్నారు. అలా అయితే టెక్నలజీ ఉపయోగించి కమల్ హాసన్ ని శంకర్ యంగ్ లుక్ లో చూపించాల్సి ఉంటుంది.

అదే జరిగితే మాత్రం ఫ్యాన్స్ కి కచ్చితంగా సర్ ప్రైజ్ గా ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ ని ముసలాడిగా చూపించడం కోసం ప్రత్యేకమైన మేకప్ వాడారు. అలాగే యంగ్ లుక్ కోసం శంకర్ ఏదో ఒక ప్లాన్ చేసే ఉంటాడని భావిస్తున్నారు. అదే జరిగితే భారతీయుడు 2 చిత్రంలో కమల్ హాసన్ చూపించే వేరియేషన్ చూడటానికైనా ప్రేక్షకులు థియేటర్స్ కి తరలివెళ్లే అవకాశం ఉంటుంది.