నాగి సాధారణంగా కనిపించే అసాధారణ వ్యక్తి: కమల్
కమల్ తన గత రూపాలను పునరావృతం చేయకుండా ఉండాలనే తన కోరికను తొలిగా దర్శకుడు నాగ్ అశ్విన్ కి వివరించారట.
By: Tupaki Desk | 19 Jun 2024 5:00 PM GMTనాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ 'కల్కి 2898 AD' బిగ్ రిలీజ్ కోసం సర్వం సిద్ధంగా ఉంది. ఈరోజు అంటే జూన్ 19న ముంబైలో కల్కి బృందం భారీ ఈవెంట్ ని నిర్వహించింది. ఈ వేడుకలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, అశ్వనిదత్ పాల్గొనగా... ప్రభాస్ స్నేహితుడు దగ్గుబాటి రానా ఈవెంట్ ని హోస్ట్ చేసారు.
ఈ వేడుకలో కమల్ హాసన్‌ను సినిమాలో తన విలక్షణమైన ప్రదర్శన గురించి ప్రశ్నించగా.. తనదైన శైలిలో స్పందించారు. కమల్ తన గత రూపాలను పునరావృతం చేయకుండా ఉండాలనే తన కోరికను తొలిగా దర్శకుడు నాగ్ అశ్విన్ కి వివరించారట. ఒక కొత్త లుక్ తో సొంతంగా క్రియేట్ చేసినదానిని ప్రయత్నించానని తెలిపారు. అయితే బిగ్ బి ఇప్పటికే తన లుక్‌లో ఆ కొత్తదనాన్ని వైవిధ్యాన్ని ప్రదర్శించారని కమల్ ఆ తరువాత గ్రహించారట. అతడు కవచం ధరించమని కూడా సూచించాడు. అయితే ప్రభాస్ అప్పటికే కవచం ధరించాడు. ఈ సినిమాలో తాను ప్రెగ్నెంట్ అవ్వడం ఇష్టం లేక కానీ.. దీపికా పదుకొణె లుక్ కూడా ట్రై చేసి ఉండేవాడిని అంటూ సీనియర్ నటుడు కమల్ తనదైన శైలిలో చమత్కరించారు. ఆయన మాటలు అహూతుల్లో నవ్వులు కురిపించాయి.
కమల్ ఇంకా మాట్లాడుతూ.. ''కల్కి 2898 ADలో తన రూపాన్ని పరిపూర్ణం చేయడానికి తన బృందం లాస్ ఏంజిల్స్‌కు చాలాసార్లు ప్రయాణించింద''ని కమల్ హాసన్ పేర్కొన్నాడు. తన కొత్త అప్పియరెన్స్‌కి ప్రేక్షకులు సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
చాలా ఫన్ ఉంటుంది ..
ఉలగ నాయగన్ కమల్ హాసన్ దర్శకుడు నాగ్ అశ్విన్ పై తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు. ''నాగ్ అశ్విన్ మా గురువు గారు బాలచందర్ గారిలా ఆర్డీనరిగా కనిపించే ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్. తన ఐడియాని అద్భుతంగా ప్రెజెంట్ చేసే నేర్పు నాగ్ అశ్విన్‌కి వుంది. ఇందులో బ్యాడ్ మ్యాన్ గా కనిపిస్తాను. ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. నాగ్ అశ్విన్ చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు. నా ఫస్ట్ లుక్ చూసి సర్ ప్రైజ్ అయినట్లే సినిమా చూసి కూడా చాలా సర్ ప్రైజ్ అవుతారు'' అన్నారు.