Begin typing your search above and press return to search.

అయ్యో నా మాట అర్థం అది కాదు : కమల్‌

ఎంతగా కమల్‌ కవర్‌ చేసే ప్రయత్నం చేసినా కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన కూడా ఇండియన్ 2 కి భారీ స్థాయిలో బజ్ క్రియేట్‌ అవ్వడం లేదు అనేది సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చ.

By:  Tupaki Desk   |   7 July 2024 8:36 AM GMT
అయ్యో నా మాట అర్థం అది కాదు : కమల్‌
X

సెలబ్రిటీలు ముఖ్యంగా స్టార్స్ మాట్లాడే ప్రతి మాట అత్యంత ప్రాముఖ్యత ను సంతరించుకుంటుంది. వారు ఆదమరచి ఏ మాట మాట్లాడినా కూడా దాని పర్యవసానాలు చాలా వస్తాయి. గతంలో ఇద్దరు ముగ్గురు స్టార్‌ హీరోలు అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇప్పుడు యూనివర్శల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.

ఆయన నటించిన ఇండియన్ 2 సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత ఐదు సంవత్సరాలుగా ఈ సినిమా గురించిన చర్చ జరుగుతుంది. స్క్రిప్ట్‌ పరిధి పెరగడంతో పాటు, సింగిల్ పార్ట్‌ లో కథ ను చెప్పడం సాధ్యం కావడం లేదు అంటూ ఇండియన్ 3 ను కూడా తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించారు.

సెకండ్‌ పార్ట్‌ విడుదల సమయంలో థర్డ్‌ పార్ట్‌ గురించి మాట్లాడటం సహజంగానే జరుగుతుంది. అయితే కమల్‌ హాసన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఇండియన్ 3 చాలా బాగా నచ్చింది, కథ మొత్తం అందులోనే ఉండబోతుంది, ప్రతి ఒక్కరు థ్రిల్‌ అయ్యే ఎలిమెంట్స్ అందులో ఉంటాయి అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు.

ఆ వ్యాఖ్యలు ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇండియన్‌ 3 సూపర్‌ గా ఉంటుందని అన్నాడంటే, ఇండియన్ 2 పై కమల్‌ కి ఆసక్తి మరియు అంచనాలు లేవు అన్నట్లుగా అర్థం అవుతుంది అంటూ సోషల్‌ మీడియాలో కొందరు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.

సోషల్‌ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం పై కమల్‌ హాసన్ వెంటనే స్పందించాడు. నేను ఇండియన్‌ 3 బాగుంటుంది అంటే ఇండియన్‌ 2 నాకు నచ్చలేదు అని అర్థం కాదు. మనం అందరి భోజనం చేసే సమయంలో చివర్లో తినే డెజర్ట్‌ చాలా బాగా అనిపిస్తుంది. అంత మాత్రాన భోజనం మొత్తం బాగా లేదని అర్థం కాదు కదా అన్నట్లుగా కవర్‌ చేసే ప్రయత్నం చేశాడు.

ఎంతగా కమల్‌ కవర్‌ చేసే ప్రయత్నం చేసినా కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన కూడా ఇండియన్ 2 కి భారీ స్థాయిలో బజ్ క్రియేట్‌ అవ్వడం లేదు అనేది సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చ. అయితే అడ్వాన్స్ బుకింగ్‌ మొదలు అయితే తప్ప అసలు విషయం ఏంటి అనేది క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

ఈ సినిమాలో కమల్‌ లుక్ తో పాటు, కొన్ని యాక్షన్‌ సన్నివేశాలకు సంబంధించి తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెల్సిందే. వంద ఏళ్లు దాటిన వ్యక్తి ఇంతగా యాక్షన్‌ ఎలా చేస్తాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తే దర్శకుడు దానికి తనదైన లాజిక్ చెప్పే ప్రయత్నం చేశారు. సినిమా బాగుంటే కమల్‌ లుక్ ఇతర విషయాలు అన్నీ కూడా పక్కకు పోతాయి అనేది యూనిట్‌ సభ్యుల అభిప్రాయం.