ఇండియన్ 2.. ఆ విషయంలో డిజప్పాయింటెడ్..!
1996లో భారతీయుడు సినిమా సృష్టించిన సినిమాలు అన్నీ ఇన్నీ కావు. అప్పటికే శంకర్ అంటే ఒక మార్క్ ఉండగా ఆ సినిమాతో అది పర్మినెంట్ బ్రాండ్ గా మారేలా చేసుకున్నాడు.
By: Tupaki Desk | 4 Nov 2023 5:24 AM GMT1996లో భారతీయుడు సినిమా సృష్టించిన సినిమాలు అన్నీ ఇన్నీ కావు. అప్పటికే శంకర్ అంటే ఒక మార్క్ ఉండగా ఆ సినిమాతో అది పర్మినెంట్ బ్రాండ్ గా మారేలా చేసుకున్నాడు. కరెప్షన్ కాన్సెప్ట్ తో వచ్చిన భారతీయుడు సినిమా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది. ఆ సినిమా వచ్చిన పాతికేళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశారు శంకర్. మూడేళ్ల క్రితమే భారీగా మొదలు పెట్టిన ఈ సినిమా మధ్యలో క్రేన్ యాక్సిడెంట్ వల్ల యూనిట్ ప్రాణ నష్టం జరగడం తో సినిమాపై బ్లాక్ మార్క్ పడింది.
ఇక మధ్యలో ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల సినిమాని ఆపేశారు కూడా. కమల్ హాసన్ విక్రం సూపర్ హిట్ అవడంతో ఆల్రెడీ షూటింగ్ పార్ట్ కొద్దిగా చేసిన ఇండియన్ 2 ని సెట్స్ మీదకు తీసుకొచ్చారు. శంకర్, కమల్ ఇద్దరు తమ ఫుల్ ఎఫర్ట్స్ తో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఎన్నో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ఇంట్రో టీజర్ రిలీజైంది. ఈ టీజర్ చూసిన కమల్ ఫ్యాన్స్ ఇది కదా మాకు కావాల్సింది అనేస్తున్నారు. శంకర్ కూడా ఇండియన్ 2 ని ఎంత ఫోకస్ గా తెరకెక్కిస్తున్నాడు అన్నది తెలిసిపోయింది.
రిలీజైన టీజర్ లో ఒక్కటే ఒక్క డిజప్పాయింట్ మెంట్ కనిపిస్తుంది. కమల్ హాసన్ ఓల్డ్ గెటప్ మేకప్ విషయంలో కాస్త జాగ్రత్త పడితే బాగుండేది. ఇదే విషయాన్ని నెటిజన్లు చెబుతున్నారు. ఇండియన్ 2 టీజర్ సూపర్ కానీ కమల్ మేకప్ మాత్రం నిరుత్సాహంగా ఉందని అంటున్నారు. అంతేకాదు పాతికేళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమాలోనే మేకప్ బాగుందని ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగినా శంకర్ ఓల్డ్ కమల్ లుక్ ని సరిగా తీర్చిదిద్దలేదని అంటున్నారు.
టీజర్ రిలీజ్ అయ్యాక పాజిటివ్ గా ఎంతమంది రియాక్ట్ అవుతారో దానిలోని లోపాలను చూపించడానికి కొందరు సిద్ధంగా ఉంటారు. ఇండియన్ 2 టీజర్ లో కమల్ మేకప్ గురించి ఆడియన్స్ చింతిస్తున్నారు. అయితే కమల్ ఫ్యాన్స్ మాత్రం ఈ టీజర్ ని చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియన్ 2 సినిమా మొదటి పార్ట్ ని మించి అదరగొడుతుందా లేదా అన్నది చూడాలి. శంకర్ తిరిగి ఫాం లోకి రావాలని సినీ ప్రియులు కోరుతున్నారు. ఇండియన్ 2 ఇంట్రో టీజర్ ఆ ఫీల్ ఇచ్చినా కమల్ మేకప్ విషయంలోనే ప్రేక్షకులు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. మరి అది సినిమాలో కవర్ అయ్యేలా చేస్తే బెటర్ లేదంటే చాలా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.