Begin typing your search above and press return to search.

ఎవరూ ఊహించని, సర్‌ ప్రైజింగ్ మూవీ రీ రిలీజ్‌

ఇలాంటి సమయంలో యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ నటించిన పుష్పక విమానం సినిమా ను రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన.

By:  Tupaki Desk   |   17 Sep 2023 3:45 AM GMT
ఎవరూ ఊహించని, సర్‌ ప్రైజింగ్ మూవీ రీ రిలీజ్‌
X

ఈ మధ్య కాలంలో స్టార్‌ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవ్వడం అనేది చాలా కామన్ గా జరుగుతుంది. ఇలాంటి సమయంలో యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ నటించిన పుష్పక విమానం సినిమా ను రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన రావడం ప్రతి ఒక్కరిని కూడా సర్‌ ప్రైజ్ కి గురి చేసింది. ఈ తరం ప్రేక్షకులకు ఇలాంటి సినిమా ఒకటి చూపించాల్సిన అవసరం ఉంది.


సినిమా ఇండస్ట్రీ మొదట మూవీగా ఉండేది. అంటే మాటలు లేకుండా బొమ్మలు మాత్రమే కనిపించేవి. కాల క్రమేనా డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టారు. మాటల సినిమాలు వచ్చి ఎన్నో కమర్షియల్ హంగులు అద్దుకున్న తర్వాత కూడా పుష్పక విమానం సినిమాను మూకీగా ప్రముఖ దర్శకుడు సింగీతం వారు రూపొందించి అప్పట్లో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

ఈ జనరేషన్ వారి కోసం ఒక మూకీ సినిమా రీ రిలీజ్ అవ్వనుందని ఏ ఒక్కరు ఊహించలేదు. తమిళ్, కన్నడం, తెలుగు ఇలా అన్ని భాషల్లో కూడా ఈ సినిమా ను రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా కమల్ హాసన్ నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. పుష్పక్‌, పేసుంపదం అనే టైటిల్స్ తో ఆయా భాష ల్లో సినిమా ను రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా పోస్టర్ ను కూడా విడుదల చేయడం జరిగింది.

సైలెంట్ బ్లాక్ కామెడీ మూవీ గా ఇండియన్ సినీ చరిత్రలో ఒక అరుదైన మూవీగా నిలిచే ఈ సినిమాను రీ రిలీజ్ చేయడం ద్వారా ఈ తరం ఫిల్మ్‌ మేకర్స్ తో పాటు ప్రేక్షకులకు కూడా చాలా సర్ ప్రైజింగ్‌ గా ఉండటంతో పాటు మంచి అనుభూతిని పంచిన వారు అవుతారు అంటూ అప్పట్లో పుష్పక విమానం చూసిన వారు అంటున్నారు.

ఒక రోజు రాజుగా అనే కథ ను మూలం గా తీసుకుని సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా లో కమల్ హాసన్‌, అమల, టినూ ఆనంద్‌, పీ ఎల్ నారాయణ వంటి ప్రముఖ నటీ నటులు పాల్గొన్నారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అత్యంత కీలకంగా ఉంటుంది. ఎల్ వైధ్యనాథ్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ ను అందించారు.

రీ రిలీజ్ అంటే ఏదో ఒక రోజు ఒక షో వేయకుండా రెగ్యులర్ సినిమాల మాదిరిగా ఈ సినిమా ను రీ రిలీజ్ చేస్తే ఎంతో మందికి ఈ సినిమా చేరువ అవుతుందని సినీ ప్రేమికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విడుదల తేదీ ఇంకా కన్ఫర్మ్‌ అవ్వని ఈ సినిమా కోసం కమల్‌ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు వెయిట్‌ చేస్తున్నారు.