Begin typing your search above and press return to search.

ఆ స్టార్ దూకుడు కి సాటెవ్వ‌రూ

ఈ నేప‌థ్యంలో కమల్ హాసన్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #KH237కు సంబధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చేసారు. క‌మ‌ల్ 237వ చిత్రం కోసం ఏకంగా ఇద్ద‌రు కొరియోగ్రాఫ‌ర్ల‌ను రంగంలోకి దించుతున్నారు.

By:  Tupaki Desk   |   13 Jan 2024 11:30 PM GMT
ఆ స్టార్ దూకుడు కి సాటెవ్వ‌రూ
X

విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ దూకుడు ఒక్క‌సారిగా పెంచిన సంగ‌తి తెలిసిందే. విక్ర‌మ్ విజ‌యంతో వ‌రుస‌గా ప్రాజెక్ట్ లు ప్ర‌క‌టించి వేగం పెంచారు. ఇప్పుడా వేగాన్ని ఇంకా రెట్టింపు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా సినిమాలు చేస్తూనే మ‌రో వైపు సొంత నిర్మాణ సంస్థ‌లో ఇత‌ర హీరోలతో సినిమాలు నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే మూడు ద‌శాబ్ధాల త‌ర్వాత మ‌ళ్లీ మ‌ణిర‌త్నంని సైతం తెర‌పైకి తెచ్చి ఆయ‌న‌తో సైతం ఓ సినిమా ప్ర‌క‌టించి స‌ర్ ప్రైజ్ చేసారు.

ఇంకా పాన్ ఇండియా చిత్రం క‌ల్కి 2898 లో విల‌న్ గానూ న‌టిస్తూ అభిమానుల‌కు కొత్త అనుభూతిని పంచ‌డానికి రెడీ అవుతున్నారు. ఇవ‌న్నీ ఒకేసారి చోటు చేసుకున్నాయి. విక్ర‌మ్ విజ‌యం త‌ర్వాత క‌మ‌ల్ హాసన్ లో వ‌చ్చిన మార్పు ఇదంతా. ఒక‌ప్పుడు క‌మ‌ల్ హాస‌న్ సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయాలంటే? రెండేళ్లు స‌మ‌యం ప‌ట్టేది. ఇప్పుడా ప‌ద్ద‌తికి చ‌ర‌మ‌గీతం ప‌లుకుతు యువ హీరోల‌కు పోటీగా సినిమాలు చేయ‌డం మొద‌లు పెట్టారు.

పోటీ వాతావ‌ర‌ణంలో ఎలా ముందుకు వెళ్లాలో ప‌క్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలో కమల్ హాసన్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #KH237కు సంబధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చేసారు. క‌మ‌ల్ 237వ చిత్రం కోసం ఏకంగా ఇద్ద‌రు కొరియోగ్రాఫ‌ర్ల‌ను రంగంలోకి దించుతున్నారు. వారిని ద‌ర్శ‌కులు గా ప‌రిచ‌యం చేస్తూ సినిమా చేస్తున్నారు. వారే ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్‌లు అన్బరివ్ (అన్బుమణి- అరివుమణి) దర్శకత్వం వహిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

ఈ విషయాన్ని కమల్ హాసన్ తెలియజేస్తూ.. 'ఇద్దరు ప్రతిభావంతులు, వారి కొత్త అవతార్‌లో #KH237 దర్శకులుగా చేరడం గర్వంగా ఉంది. మాస్టర్స్ అన్బరివ్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌కి తిరిగి స్వాగతం' అని ట్వీట్ చేశారు. కమల్ హాసన్- ఆర్ మహేంద్రన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ 'థ‌గ్ లైఫ్' ప్రాజెక్ట్ ప‌నుల్లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.