కమల్ హాసన్ బాలీవుడ్‌ని వదిలిపెట్టడానికి కారణం?
దీనిపై కమల్ తాజా ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను రివీల్ చేసారు.
By: Tupaki Desk | 23 Jun 2024 2:30 AM GMTకమల్ హాసన్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అతిపెద్ద సూపర్ స్టార్లలో ఒకరు. విశ్వనటుడుగా కీర్తినందుకున్న కమల్ కెరీర్ లో చేయని ప్రయోగాలు లేవు. ముఖ్యంగా తమిళం-తెలుగులో అగ్రహీరోగా కొనసాగిన కమల్ హాసన్ 1981లో 'ఏక్ దుయుజే కే లియే'తో హిందీ సినీరంగంలోకి ప్రవేశించాడు. అయితే బాలీవుడ్‌లో కొద్దికాలం పనిచేసిన తర్వాత కమల్ హాసన్ 'బాంబే డ్రీమ్'ని కొనసాగించకూడదని ఆ పరిశ్రమ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. దీనిపై కమల్ తాజా ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను రివీల్ చేసారు.
నాటి కాలం అలా ఉండేది...నేను హిందీ సినిమాకి పేద బంధువును. నేను నా స్వంత లాండ్రీ నేనే చేసుకోవాల్సిన స్థితి. అలాంటి పనులన్నీ చేయాల్సి వచ్చింది. వారు (ఉత్తరాది స్టార్లు సెలబ్రిటీలు) నిజంగా చెడిపోయిన ధనవంతులు. రెండున్నరేళ్లపాటు వేచి ఉండి ఒక సినిమాలో నటించగలిగాను.. వారు అయితే ఒకేసారి 6 సినిమాలు చేయగలరు. నైతికంగా సాంకేతికంగా చెప్పాలంటే క్యారెక్టర్-బిల్డింగ్‌లో నేను చాలా ఓడిపోయానని అనుకున్నాను. బాలీవుడ్ ని వదిలేయడానికి ఇవన్నీ ఒక కారణం'' అని 2017లో ఇండియా టుడేతో ఇంటర్వ్యూలో కమల్ హాసన్ అన్నారు.
మరో కారణం అక్కడి వారికి చాలా అండర్ వరల్డ్ కనెక్షన్లు ఉన్నాయి. నేను దానిని వ్యతిరేకించడానికి లేదా బెదిరింపులకు లొంగిపోవడానికి అక్కడ ఉండదలచుకోలేదు. నల్లధనంతో నాకు ఎలాంటి సంబంధం లేదని నిర్ణయించుకున్న నటుల్లో నేనూ ఒకడిని. అవినీతి లేకుండా ఒక నటుడిని పెద్ద స్టార్ గా చేయడం సాధ్యమేనా? అని ప్రశ్నిస్తే.. అది సాధ్యమే. నేను దానికి ప్రత్యక్ష నిదర్శనం. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను కాలక్రమంలో నెమ్మదిగా కారులో వెళ్లాను. ఆ స్థాయికి ఎదిగాను. ఇది సాధ్యమే. ఇంతకు ముందు ఎవరో అలా చేశారు. కెమెరామెన్ విన్సెంట్ అనుకుంటాను. నల్లధనాన్ని తానెప్పుడూ ముట్టుకోలేదు. నల్లధనాన్ని మీ వద్ద ఉంచుకోవద్దని ప్రభుత్వాలు బెదిరించడానికి ముందు ఇది చాలా కాలం కొనసాగింది. నేను - నా సోదరుడు అలాంటి బెదిరింపులను రిసీవ్ చేసుకున్నాము.. అని తెలిపారు.
కమల్ హాసన్ నటించిన 'కల్కి 2898 AD'.. 'భారతీయుడు 2` కేవలం వారాల గ్యాప్ లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కల్కిలో అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీలతో కలిసి కనిపించనున్నారు. ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో కమల్ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి సంబంధించిన లుక్‌ని రూపొందించడానికి దర్శకుడు నాగ్ అశ్విన్‌తో చాలా సమయం వెచ్చించానని తెలిపారు. ఈ సినిమాలో కమల్ విలన్‌గా కనిపించనున్నారు.
కమల్ ఇంకా చాలా విషయాలు చెప్పారు. నేను ఎప్పుడూ చెడ్డవాడిగా నటించాలనుకుంటున్నానని తెరవెనుక అమిత్ జీ దగ్గర విచారం వ్యక్తం చేసాను. చెడ్డవాడు సినిమాల్లో మంచి పనులన్నీ చేస్తాడు. హీరోలు రొమాంటిక్ సాంగ్స్ పాడుతూ హీరోయిన్ కోసం వెయిట్ చేస్తున్న చోట నేను చెడ్డవాడిగా నటించబోతున్నాను కాబట్టి అది సరదాగా సాగిపోతుంది. కానీ (నాగ్) భిన్నంగా ఉండాలని కోరుకున్నాడు కాబట్టి నేను దాదాపు చెడ్డ ఆలోచనతో ఋషిలా కనిపిస్తాను``అని కమల్ అన్నారు. కల్కి 2898 AD జూన్ 27న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. భారతీయుడు 2లో సేనాపతిగా కమల్ హాసన్ మరోసారి తనదైన మార్క్ చూపించనున్నారు. ఈ చిత్రం జూలై 12న విడుదల కానుంది.