20 నిమిషాల పాత్రకు 10 కోట్ల రెమ్యూనరేషన్..?
కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రభాస్ కల్కి 2898 సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.
By: Tupaki Desk | 21 May 2024 9:38 AM GMTకేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రభాస్ కల్కి 2898 సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. వైజయంతి మూవీస్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాన దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక సినిమా విడుదల డేట్ ఇది వరకే మారిన విషయం తెలిసిందే. మే 9వ తేదీన రావాల్సిన కల్కి సినిమా ఇప్పుడు జూన్ 27వ తేదీన రాబోతోంది.
ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ హడావిడి కూడా మొదలైపోయింది. బుధవారం రోజు రామోజీ ఫిలిం సిటీ లో ఒక గ్రాండ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ప్రభాస్ అభిమానులు కూడా భారీ స్థాయిలో పాల్గొనబోతున్నారు. ఇక ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అనే విషయంలో కూడా అనేక రకాల గాసిప్స్ అయితే పుట్టుకొస్తూ ఉన్నాయి.
ముఖ్యంగా కమలహాసన్ క్యారెక్టర్ ను దర్శకుడు ఎలా డిజైన్ చేశాడో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ క్యారెక్టర్ కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఉంటుందట. సినిమా చివరలో వచ్చే ఆ పాత్ర చాలా ఇంపాక్ట్ చూపించే విధంగా ఉంటుందట. ఇక సెకండ్ పార్ట్ పై కూడా కమల్ హాసన్ పాత్ర చాలా ఆసక్తిని పెంచుతుందని టాక్.
ఫస్ట్ పార్ట్ కంటే కూడా సెకండ్ పార్ట్ లో కమల్ హాసన్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది అని తెలుస్తోంది. అయితే మరీ 20 నిమిషాలు అంటే కాస్త తక్కువే. ప్రభాస్ తో కమల్ హాసన్ క్యారెక్టర్ ఒక రెండు మూడు సీన్స్ లోనే ఉంటుందట. అయితే ఈ పాత్ర చేయడానికి కమల్ హాసన్ పారితోషకం కూడా గట్టిగానే తీసుకున్నట్లు తెలుస్తోంది.
చాలా తక్కువ రోజుల్లోనే ఆయన షూటింగ్ కూడా ఫినిష్ అయ్యింది. అయితే కమల్ హాసన్ దాదాపు పది కోట్ల రేంజ్ లోనే ఆ పాత్ర కోసం పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. ఇక సెకండ్ పార్ట్ మొదలైన తర్వాత ఆయనకు మరో రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకునే అవకాశం అయితే ఉంది.
ఇక ఈ సినిమాలో అమితాబచ్చన్ అశ్వద్ధామ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీపికా పదుకొనే పద్మావతి అనే క్యారెక్టర్ లో కనిపించబోతోంది. దిశా పటాని అలాగ మరి కొంతమంది స్టార్ నటీనటులు కూడా ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్రలలో కనిపిస్తారని సమాచారం. ఇక ఈ రేంజ్ భారీ క్యాస్ట్ తో సిద్ధమవుతున్న కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.