Begin typing your search above and press return to search.

భారతీయుడు-2.. తెలంగాణ సీఎం ఏమన్నారంటే..

మెగాస్టార్ చిరంజీవి.. డ్రగ్స్ కు సంబంధించి చేసిన ఓ వీడియోను ఎగ్జాంపుల్ గా కూడా చూపించారు.

By:  Tupaki Desk   |   9 July 2024 12:41 PM GMT
భారతీయుడు-2.. తెలంగాణ సీఎం ఏమన్నారంటే..
X

సినిమాల రిలీజ్ కు ముందుకు టికెట్ల హైక్ కోసం తమ వద్దకు వచ్చే వారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ సూచన చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించేలా వీడియోలు చేయాలని షరతులు విధించారు. సామాజిక బాధ్యతగా వీడియోలు చేయాలని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి.. డ్రగ్స్ కు సంబంధించి చేసిన ఓ వీడియోను ఎగ్జాంపుల్ గా కూడా చూపించారు.

అయితే కమల్ హాసన్ భారతీయుడు-2 మూవీ యూనిట్.. సీఎం రేవంత్ సూచనల మేరకు ఇప్పుడు వీడియో చేసింది. ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమా మేకర్స్ కూడా అలా వీడియో చేయకపోగా.. భారతీయుడు-2 మూవీ టీమ్ ముందడుగు వేసింది. వీడియోలో డైరెక్టర్ శంకర్ తోపాటు క్యాస్టింగ్ కమల్ హాసన్, సముద్రఖని, సిద్దార్థ్ నో టు డ్రగ్స్‌ అంటూ నినదించారు. ఇలాంటి మంచి సూచనలు ఇచ్చిన రేవంత్ రెడ్డికి కమల్ థ్యాంక్స్ చెప్పారు.

ఇప్పుడు ఈ వీడియోను రేవంత్ రెడ్డి.. తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. భారతీయుడు 2 టీమ్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. "డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రజా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా.. శ్రీ కమల్ హాసన్.. శ్రీ శంకర్.. శ్రీ సిద్దార్థ.. శ్రీ సముద్ర ఖని కలిసి ఈ అవగాహనా వీడియో రూపొందించడం హర్షించదగ్గ విషయం" అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. భారతీయుడు-2 టీమ్ చేసిన వీడియోను కూడా పోస్ట్ చేశారు.

అయితే ఇదే వీడియో విషయంపై భారతీయుడు-2 ప్రెస్ మీట్ లో సిద్ధార్థ్ ఏ మాట్లాడారో తెలిసిందే. చాలా ఏళ్ల క్రితమే తాను కండోమ్స్ కు మద్దతుగా ప్రచారం చేశానని తెలిపారు. ఉమ్మడి ఆంధప్రదేశ్ లో అనేక చోట్ల హోర్డింగ్స లో తన ఫేస్ ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు ఏ సీఎం కూడా మీరు అది చేస్తే, తాము ఇది చేస్తామని చెప్పలేదని అంటూ వ్యంగ్యంగా అన్నారు.

దీంతో సిద్ధార్థ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత మరో వీడియో రిలీజ్ చేసి వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారాయన. తన మాటల్ని అంతా తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఎప్పుడూ పోరాడుతూనే ఉంటామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి షరతును తప్పకుండా పాటిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత కాసేపటికే మూవీ టీమ్ చేసిన వీడియోను మేకర్స్ పోస్ట్ చేశారు.