Begin typing your search above and press return to search.

కల్కి.. కమల్ కనిపించేది ఎంత సేపు?

జులై 12వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ఇండియన్-2 మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.

By:  Tupaki Desk   |   6 Jun 2024 4:51 AM GMT
కల్కి.. కమల్ కనిపించేది ఎంత సేపు?
X

విలక్షణ నటుడు కమల్ హాసన్.. 2024లో వరుస సినిమాలతో అలరించనున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లీడ్ రోల్ లో నటించిన ఇండియన్-2తో సందడి చేయనున్నారు. 28 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ భారతీయుడు మూవీకి సీక్వెల్ గా వస్తుండడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. జులై 12వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ఇండియన్-2 మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.

అంతకన్నా ముందు.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ చిత్రంతో కూడా కమల్ ఆడియన్స్ ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఆయన పూర్తిస్థాయి పాత్ర చేస్తున్నారని చాలా నెలలుగా వార్తలు వస్తున్నాయి. కానీ తనది మూవీలో గెస్ట్ రోల్ అని ఇటీవల చెప్పి షాకిచ్చారు. ఇప్పటికే తన షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయినట్లు తెలిపారు. తన కెరీర్ లో ఇలాంటి మూవీ ఇప్పటి వరకు చేయలేదని చెప్పి అంచనాలు పెంచారు.

అయితే కల్కిలో కమల్ హాసన్ స్క్రీన్ టైంకు సంబంధించి ఇప్పుడు నెట్టింట జోరుగా చర్చగా సాగుతోంది. సినిమాలో కమల్ చాలా తక్కువ సమయం కనిపిస్తారని కొందరు అంటున్నారు. కేవలం రెండే రెండు నిమిషాలు కనిపిస్తారని చెబుతున్నారు. ఇంకొందరు 5 నిమిషాల పాత్ర ఉంటుందని గెస్ చేస్తున్నారు. కానీ కమల్ రోల్ టైం తక్కువ సేపు ఉన్నా ..మంచి ఇంపాక్ట్ కలిగి ఉన్న పాత్ర అని లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తోంది.

12 నిమిషాల పాటు కమల్ సందడి చేయనున్నారని ఇండస్ట్రీ నుంచి వార్తలు వస్తున్నాయి. సెకండాఫ్ లో కనిపిస్తారని.. కమల్ రోల్ తోనే మూవీ ఎండ్ అవుతుందని తెలుస్తోంది. విలన్ లాంటి రోల్ లో కమల్ అలరించనున్నారని వినికిడి. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కమల్ తో పాటు సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనె, దిశా పటాని, బ్రహ్మానందం సహా పలువురు నటీనటులు కనిపించనున్నారు.

సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జోనర్ లో టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. రూ.600 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. జూన్ 10వ తేదీన ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. వరల్డ్ వైడ్ గా జూన్ 27వ తేదీన రిలీజ్ కానున్న ఈ చిత్రం ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.