Begin typing your search above and press return to search.

రణం పాప గుర్తుందా.. ఇంకా అదే గ్లామర్ మెరుపు

బ్లాక్ కలర్ డ్రెస్ లో మిర్రర్ ముందు నిలబడి ఫోటోకి ఫోజులిచ్చింది. ఈ ఫోటోపై కామ్నా అభిమానులు ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   14 Jun 2024 3:00 AM GMT
రణం పాప గుర్తుందా.. ఇంకా అదే గ్లామర్ మెరుపు
X

టాలీవుడ్ లో ఒకప్పటి హీరోయిన్ కామ్నా జెఠ్మలానీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ ప్రేమికులు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తరువాత జయం రవికి జోడీగా తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది ఆమె నుంచి మూడో చిత్రంగా వచ్చిన గోపీచంద్ రణం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మొదట్లో అమ్మడు గ్లామరస్ పాత్రలు ఎక్కువగానే చేసినప్పటికీ విమర్శలు తావివ్వకుండా మంచి కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంది.

సినిమాలకు తగ్గట్లే నటిస్తూ మంచి క్రేజ్ అందుకుంది. మొదట్లోనే ఒప్పుకున్న సినిమాలతో కామ్నా జెఠ్మలానీకి మంచి పేరు తీసుకొచ్చింది.

రణం మూవీ తర్వాత జగపతిబాబుకి జోడీగా సామాన్యుడు సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా హిట్ అయ్యింది. ఆ తరువాత ఈ బ్యూటీ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. ఇక కొన్నాళ్ళ అనంతరం చెప్పుకోదగ్గ సక్సెస్ లు అందుకోలేదు.

కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కి పరిమితం అయ్యింది. కెరియర్ పరంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ లేకపోవడం కామ్నా జెఠ్మలానీ 2014లో బెంగుళూరుకి చెందిన బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకుంది. తరువాత కొంతకాలం సినిమాలకి దూరమైంది. మళ్ళీ ఈ మధ్య కామ్నా జెఠ్మలానీ యాక్టివ్ అయ్యింది. డిజిటల్ ఎంట్రీ ఇచ్చి వ్యవస్థ అనే వెబ్ సిరీస్ లో నటించింది.

ఈ వెబ్ సిరీస్ కి పాజిటివ్ టాక్ వచ్చింది. కన్నడ సినిమాలలో అడపాదడపా నటిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో కూడా ఈ బ్యూటీ యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తనకి సంబందించిన అప్డేట్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. ఒకప్పటి హీరోయిన్స్ అందరూ ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు. అభిమానులతో కనెక్ట్ అవుతున్నారు. అలాగే వారి రెగ్యులర్ అప్డేట్స్ కూడా పంచుకుంటున్నారు.

కామ్నా జెఠ్మలానీ కూడా ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ తో అదిరిపోయే ఫోజులుతో ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటో కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. బ్లాక్ కలర్ డ్రెస్ లో మిర్రర్ ముందు నిలబడి ఫోటోకి ఫోజులిచ్చింది. ఈ ఫోటోపై కామ్నా అభిమానులు ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇచ్చేలా కామ్నా అందం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సరైన క్యారెక్టర్ పడితే ఇప్పటికి కామ్నాకి అదిరిపోయే ఫాలోయింగ్ సినిమాలలో ఉంటుందని పోస్టులు పెడుతున్నారు. దీనిపై కామ్నా ఎలా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి.