Begin typing your search above and press return to search.

సెట్లో ఊహించని అతిథి.. షాకైన కంగ‌న‌

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ‌రుస ప‌రాజయాల న‌డుమ సౌత్ సినిమాలతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Nov 2023 3:49 AM GMT
సెట్లో ఊహించని అతిథి.. షాకైన కంగ‌న‌
X

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ‌రుస ప‌రాజయాల న‌డుమ సౌత్ సినిమాలతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ ని వ‌దిలి సౌత్ లో సెటిల‌వుతోందంటూ ముంబై మీడియా క‌థ‌నాలు వెలువ‌రిస్తోంది. త‌దుప‌రి `త‌నువెడ్స్ మ‌ను రిట‌ర్న్స్` కోస్టార్ మాధవన్ తో క‌లిసి కంగనా రనౌత్ AL విజయ్ దర్శకత్వం వహిస్తున్న‌ సైకలాజికల్ థ్రిల్లర్ లో న‌టిస్తోంది.ఈ సినిమా షూటింగ్ చెన్నైలో ప్రారంభమైంది.


అయితే చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో స‌డెన్ స‌ర్ ప్రైజ్ ఎదురైంది. కంగ‌న ఇది ఊహించ‌నిది కావ‌డంతో ఎంతో ఆశ్చ‌ర్య‌పోయింది. ఈ సినిమా సెట్స్‌కి రజనీకాంత్ అతిథిగా విచ్చేశారు. ఆ ఫోటోను కంగనా రనౌత్ షేర్ చేసింది. ``మా సినిమా మొదటి రోజు, గాడ్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ తలైవర్ (రజనీకాంత్‌ను ఉద్దేశించి…) మా సినిమా సెట్స్‌కి వచ్చి మాకు సర్ ప్రైజ్ ఇచ్చారు. మేము థ్రిల్ అయ్యాము. మాధవన్ త్వరలో సెట్స్‌లోకి జాయిన్ అవుతారు`` అని కంగనా తెలిపింది. ఈ సందర్భంగా మాధవన్ అద్భుతమైన ప్రారంభం అంటూ ట్వీట్ చేశారు. హిందీ చిత్రం `తను వెడ్స్ మను రిటర్న్స్` (2015) తర్వాత మాధవన్, కంగనా రనౌత్ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే.

అయితే క్వీన్ కంగ‌న ర‌నౌత్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ నుద్ధేశించి చేసిన వ్యాఖ్య ఇప్పుడు సినీవ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. `గాడ్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ తలైవర్` అంటూ కంగ‌న ప్ర‌త్యేకించి ర‌జనీని ప్ర‌శంసించింది. అయితే కంగ‌న వీలున్న ప్ర‌తి వేదికపైనా బాలీవుడ్ హీరోల‌ను త‌గ్గించి మాట్లాడేందుకు కూడా సౌత్ స్టార్ల‌ను పొగిడేస్తున్న సంగ‌తి తెలిసిందే. సౌత్ స్టార్లు, ద‌ర్శ‌క‌ ర‌చ‌యిత‌లు, సాంకేతిక నిపుణుల‌ను చూసి బాలీవుడ్ ప్ర‌ముఖులు చాలా నేర్చుకోవాల్సి ఉంద‌ని కూడా కంగ‌న ప‌దే ప‌దే వేదిక‌ల‌పై కామెంట్లు చేస్తోంది. సౌత్ సినీప్ర‌ముఖుల‌కు కంగ‌న రూపంలో కావాల్సినంత అండ ఉంది. ఏది ఏమైనా బాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో కంగ‌న వివాదాలు ఆ ర‌కంగా ట‌ర్న్ తీసుకోవ‌డం కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అదే స‌మ‌యంలో త‌లైవ‌ర్ ర‌జ‌నీకాంత్ ఈ ప్ర‌శంస‌కు పూర్తిగా అర్హుడు అన‌డంలో సందేహం లేదు.