Begin typing your search above and press return to search.

డార్క్ సినిమా వేధింపులు.. కంగ‌న కౌంట‌ర్ ర‌ణ‌బీర్‌పైనే?

రాజకీయం లేదా సినిమా.. స‌బ్జెట్ ఏదైనా త‌న అభిప్రాయాల‌ను కుండ బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు మాట్లాడ‌టం క్వీన్ క్వీన్ కంగ‌న ర‌నౌత్ ప్ర‌త్యేక‌త‌.

By:  Tupaki Desk   |   7 Dec 2023 8:44 AM GMT
డార్క్ సినిమా వేధింపులు.. కంగ‌న కౌంట‌ర్ ర‌ణ‌బీర్‌పైనే?
X

రాజకీయం లేదా సినిమా.. స‌బ్జెట్ ఏదైనా త‌న అభిప్రాయాల‌ను కుండ బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు మాట్లాడ‌టం క్వీన్ క్వీన్ కంగ‌న ర‌నౌత్ ప్ర‌త్యేక‌త‌. అమీర్ ఖాన్ `సత్యమేవ్ జయతే` షోలో పాల్గొన్న కంగ‌న ఇప్పుడు `యానిమ‌ల్` పై ఇచ్చిన స్టేట్ మెంట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పాపుల‌ర్ టీవీ షోలో కంగ‌న మాట్లాడుతూ.. సినిమాలో చీకటి (డార్క్) పాత్రల చిత్రణ గురించి.. వాటితో ఉత్ప‌న్న‌మ‌య్యే పరిణామాల గురించి కంగ‌న మాట్లాడింది.

రణబీర్ కపూర్ `యానిమల్` ఈ సీజ‌న్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం తొలివారంలో 300 కోట్లు వ‌సూలు చేసింద‌ని బాలీవుడ్ ట్రేడ్ పేర్కొంది. బాక్సాఫీస్ వ‌ద్ద గొప్ప‌ విజ‌య‌మిది. అయితే ఈ సినిమాపై ర‌క‌ర‌కాల వివాదాలు సోషల్ మీడియాలో ఘాటైన చ‌ర్చ‌కు తెర తీసాయి. వివాదాలతో గంద‌ర‌గోళం న‌డుమ ఇప్పుడు కంగ‌న `డార్క్ సినిమా & వేధింపు` అనే టాపిక్‌పై అమీర్ ఖాన్‌తో ఇంటర్వ్యూ లో మాట్లాడ‌డం హాట్ టాపిక్ అయింది.

ఆస‌క్తిక‌రంగా డార్క్ షేడెడ్ పాత్ర‌ల వ‌ల్ల ఉత్ప‌న్న‌మయ్యే స‌మ‌స్య‌ల‌పైనా క్వీన్ మాట్లాడారు. కంగ‌న‌ మాట్లాడుతూ ``నేను డార్క్ సినిమాలు తీయ‌కూడదని లేదా వాస్తవికతను తెర‌పై చూపించకూడదని చెప్పడం లేదు. కానీ అది చూపించినట్లయితే దాని తాలూకా పర్యవసానాలను చూపించడం కూడా ముఖ్యం`` అని అన్నారు. అలాంటి అబ్బాయిలు (యానిమ‌ల్ క‌థానాయ‌కుడు త‌ర‌హా) పెద్దయ్యాక ఇతరులను ర్యాగింగ్ చేయడం ప్రారంభిస్తారు. అమ్మాయిలనే కాకుండా అందరినీ వేధిస్తున్నారు. వారి తల్లిదండ్రులు కూడా బాధితులే. వారు ప్రతి ఒక్కరికీ సమస్యాత్మకమైన సంఘవిద్రోహ వ్యక్తులు. సినిమాల్లో ఇలాంటి పాత్రలు తమ ప్రవర్తనను సమర్థిస్తున్నాయని వారు (వైల్డ్ బోయ్స్) భావిస్తున్నారు. వారు ఆ పాత్ర తీరుతెన్నుల‌ను ఒంట ప‌ట్టించుకుని, అదే చొక్కా ధరిస్తారు. అదే ప్ర‌వ‌ర్త‌న చూపిస్తారు. వారి గురించి సినిమాలు వ‌స్తున్నందున వారు త‌మ‌ను తాము సరైన వ్య‌క్తులం అని అనుకుంటారు. వారి నుండి హీరోలు స్ఫూర్తి పొందారని వారు భావిస్తున్నారు`` అంటూ కంగ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

ఆర్కే సినిమాల‌ రికార్డులు బ్రేక్:

యానిమ‌ల్ ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో ఒక‌టిగా నిలిచింది. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ, OMG 2, తూ ఝూతి మైన్ మక్కార్ సినిమాల బాక్సాఫీస్ వ‌సూళ్ల‌ను ఇప్ప‌టికే అధిగమించింది. జవాన్, గదర్ 2, పఠాన్ తర్వాత ఈ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన ఐదవ చిత్రంగా నిలిచింది. ది కేరళ స్టోరీ - టైగ‌ర్ 3 రికార్డుల‌ను బ్రేక్ చేస్తోంది. యానిమల్ రన్‌టైమ్ సుమారు 3 గంటల 20 నిమిషాల‌. సినిమా బోరింగ్‌గా అనిపించే ఏ క్షణం కూడా ఉండదు. ద్వితీయార్థంలో కొద్దిపాటి స్లో ఫేస్ ఉన్నా కానీ బోర్ కొట్ట‌దు. సినిమా అంతటా ఏదో ఒకటి జరుగుతూనే ఉండ‌డం గ్రిప్పింగ్ గా అనిపిస్తుంది. స్క్రీన్‌లకు కట్టిపడేసే మ్యాజిక్‌ని సందీప్ వంగా సృష్టించ‌గ‌లిగారు. ఈ సినిమాకి కెమెరా వ‌ర్క్, అద్భుతమైన ఎడిటింగ్ నైపుణ్యాలు ప్ర‌ధాన ఆయుధాలుగా ప‌ని చేస్తున్నాయి.

ఈ సినిమాలో న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆద్యంతం ఆస‌క్తిని క‌లిగిస్తాయి. రణబీర్ కపూర్ తన కెరీర్ లో అత్యుత్త‌మ న‌ట‌న‌ను క‌న‌బ‌రిచార‌న్న చ‌ర్చా యానిమ‌ల్ తో సాధ్య‌మైంది. యే జవానీ హై దీవానీ, తూ ఝూథీ మైన్ మక్కార్ చిత్రాల్లో అత‌డి న‌ట‌న అద్వితీయం. వాట‌న్నిటినీ మించి ఒక డార్క్ పాత్ర‌తో ర‌ణ‌బీర్ స‌త్తా చాటాడు అన్న ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. హింసాత్మ‌క కంటెంట్ పై వివాదాలు ఉన్నా ఈ చిత్రంలో న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌కు గొప్ప ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి.