బాలీవుడ్ కంగనని ఏకాకిని చేసిందిగా!
కొంత మంది దుండగులు ఏకంగా కంగనని అత్యాచా రం చేసి చంపేస్తామంటూ బెదిరిపు లేఖలు సైతం రిలీజ్ చేసారు.
By: Tupaki Desk | 31 Aug 2024 12:30 AM GMTబాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన `ఎమర్జెన్సీ` రిలీజ్ వేళ కొన్ని రాష్ట్రాల్లో నిషేధ అంశం తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. రిలీజ్ పై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే న్యాయ నిపుణుల సలహా తీసుకుంటుంది. మరోవైపు శిరోమణి అకాళీదళ్ దిల్లీ పార్టీ నిలిపివేయాలంటూ సీబీఎఫ్ సీని ఆశ్రయించింది. ఇంకోవైఉ సిక్కు సంఘాలు రిలీజ్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కొంత మంది దుండగులు ఏకంగా కంగనని అత్యాచా రం చేసి చంపేస్తామంటూ బెదిరిపు లేఖలు సైతం రిలీజ్ చేసారు.
అయినా కంగన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. నా సినిమా రిలీజ్ ని ఎవరాపుతారో? చూస్తానంటూ మరో సంచలన ప్రకటన రిలీజ్ చేసింది. అత్యవసర పరిస్థితిని ఎక్కడా వక్రీకరించకుండా ఉన్నది? ఉన్నట్లే చూపించామని, ఎవర్నీ కించ పరచడం గానీ, ఎలాంటి సున్నిత అంశాలు టచ్ చేయలేదంటూ పేర్కోంది. ఈ విషయంలో కంగన ఒంటరి పోరాటమే చేస్తోంది. బాలీవుడ్ పరిశ్రమ నుంచి ఎలాంటి మద్దతు ఎమర్జెన్సీ చిత్రానికి గానూ, కంగనకు గానీ వ్యక్తిగతంగా దక్కలేదు. ఈ విషయంలో కంగన సైతం ఎంతో బాధపడింది.
అయితే ఇండస్ట్రీ స్పందిచకపోవడానికి ఇక్కడ పెద్దగా కారణాన్ని హైలైట్ చేయాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అయిన నటి కంగన. తన ముక్కు సూటి ధోరణీతో పరిశ్రమకి వ్యతిరేకంగా ఎన్నోసార్లు..ఎన్నో అంశాలపై మాట్లాడింది. బాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ అంశం అవ్వొచ్చు..స్టార్ హీరోలతో రిలేషన్ షిప్ చెడిన సందర్భంలో కంగన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి.
ఈ విషయంలో కంగనని ఏ ఒక్కరూ ఆపలేకపోయారు. తాను చెప్పాలనుకున్నది సూటిగా మీడియా ముందుకొచ్చి నిర్భయంగా మాట్లాడిన సందర్భాలెన్నో. అగ్ర నిర్మాణ సంస్థలపై ఎన్నో కామెంట్లు చేసింది. హీరోలతో సమాన పారితోషికాలు మాకెందుకు ఇవ్వరని హీరోయిన్లు అందరి తరుపున గొంతెత్తిన సందర్భాలెన్నో. దర్శక, రచయితల తీరుపైనా తనదైన బాణీని ఎన్నోసార్లు వినిపించింది.
ఇప్పుడవన్నీ కలిసి వెరసి కంగనపై మౌనంగా ప్రతీకార్య చర్యకు దిగినట్లు కనిపిస్తుంది. సాధారణంగా సినిమా నిషేధం అన్న అంశం తెరపైకి వచ్చినప్పుడు కొంతమందైనా స్పందిస్తారు. కానీ `ఎమర్జెన్సీ` విషయంలో మాత్రం ఆ సినిమాలో నటించిన మిగతా నటులు సైతం సైలెంట్ గానే ఉన్నారు. ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ అన్నీ కంగనే. నటి, నిర్మాత, దర్శకత్వం అన్ని బాధ్యతలు ఒంటి చేత్తో అన్నీ తానై మోసింది.