కంగన 'ఎమర్జెన్సీ'పై స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
మిశ్రమ సమీక్షలు వచ్చినా ఇందిర పాత్రలో కంగన అద్భుతంగా నటించిందని ప్రశంసలు దక్కాయి.
By: Tupaki Desk | 7 March 2025 10:09 PM ISTక్వీన్ కంగన రనౌత్ నటించిన `ఎమర్జెన్సీ` బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీ కాలం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం వివాదాల కారణంగా చిక్కుల్ని ఎదుర్కొంది. ఇటీవల విడుదలై, ఈ సినిమా ఫుల్ రన్ లో భారతదేశంలో 23 కోట్లు మాత్రమే వసూలు చేసింది. మిశ్రమ సమీక్షలు వచ్చినా ఇందిర పాత్రలో కంగన అద్భుతంగా నటించిందని ప్రశంసలు దక్కాయి.
అయితే ఎమర్జెన్సీ ఎందుకు ఫ్లాపైందో వివరిస్తూ నటి కం రాజకీయ నాయకురాలు రమ్య నంబీషన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కంగన ప్రతిభావంతులైన నటి అయినా కానీ, ఎమర్జెన్సీ పేలవంగా తెరకెక్కిందని రమ్య పేర్కొన్నారు. ఇది చెత్త సినిమా.. అందుకే ప్రేక్షకులు తిరస్కరించారని రమ్య విశ్లేషించారు. కంగన `మణికర్ణిక`ను తెరకెక్కించింది. అది హిట్ అయింది.. ఎందుకంటే కంటెంట్ బాగుంది.. ప్రేక్షకులు దానిని ఇష్టపడ్డారు! అని రమ్య నంబీషన్ తన అభిప్రాయాలను షేర్ చేసారు. బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో జరిగిన ప్యానెల్ చర్చ సందర్భంగా రమ్య ఈ వ్యాఖ్యలు చేసారు.
భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీగా కంగన నటించింది. ప్రధాన పాత్రను పోషించడమే కాకుండా ఈ కంగన స్వయంగా ఈ సినిమాకి దర్శకత్వం కూడా వహించింది. ఈ చిత్రం 1975 నుండి 1977 వరకు ఇందిరా గాంధీ విధించిన 21 నెలల అత్యవసర పరిస్థితి కాలాన్ని తెరపైకి తెచ్చింది. ఈ కాలాన్ని స్వతంత్ర భారతదేశంలోని చీకటి అధ్యాయంగా ప్రజలు భావిస్తారు. ఎమర్జెన్సీలో జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రలో శ్రేయాస్ తల్పాడే, పుపుల్ జయకర్ పాత్రలో మహిమా చౌదరి, ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా పాత్రలో మిలింద్ సోమన్ ; సంజయ్ గాంధీ పాత్రలో విశాక్ నాయర్ నటించారు. ఈ సినిమాలో ఇందిరమ్మగా కంగన నటనకు ప్రశంసలు కురిసాయి.