Begin typing your search above and press return to search.

OTT కంటెంట్‌కి సెన్సార్ చేయాలి: క్వీన్ కంగ‌న‌

ఇదే ఇంట‌ర్వ్యూలో ఓటీటీ వేదిక‌లు కూడా సీబీఎఫ్‌సీ పరిధిలోకి రావాలని క్వీన్ కంగ‌న‌ అభిప్రాయపడ్డారు.

By:  Tupaki Desk   |   17 Sep 2024 4:45 PM GMT
OTT కంటెంట్‌కి సెన్సార్ చేయాలి: క్వీన్ కంగ‌న‌
X

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తన చిత్రం 'ఎమర్జెన్సీ' సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వ‌డంలో ఆలస్యం చేసినందుకు క్వీన్ కంగ‌న‌ నిందించిన సంగ‌తి తెలిసిందే. న్యూస్ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హోస్ట్ నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ IC 814: ది కాందహార్ హైజాక్ ఎదుర్కొంటున్న ఇటీవలి వివాదాన్ని ప్ర‌స్థావించ‌గా, OTT ప్లాట్‌ఫారమ్ ఉగ్రవాదుల పేర్లను మార్చింది.. కానీ ద‌ర్శ‌కుడు అనుభవ్‌కు ఎటువంటి కోతలు సీబీఎఫ్‌సీ విధించ‌లేదు! అని కంగ‌న విమ‌ర్శించారు.

ఎమర్జెన్సీ కూడా సర్టిఫికేషన్ కోసం వేచి ఉన్నందున సెన్సార్ వాళ్ల ప‌ని 'ద్వంద్వ ప్రమాణాలను' హైలైట్ చేసిందా అని కంగనాను హోస్ట్ ప్ర‌శ్నించ‌గా... ఓటీటీ లలో ప్రత్యేకంగా ప్రసారం చేసిన కంటెంట్‌కు ప్రస్తుతానికి CBFC నుండి ఎలాంటి ధృవీకరణ అవసరం లేదు అని కంగ‌న అన్నారు. ఈ సంద‌ర్భంగా సీబీఎఫ్‌సీని 'రిడండెంట్ బాడీ' అని వ్యాఖ్యానించారు. ఇదే ఇంట‌ర్వ్యూలో ఓటీటీ వేదిక‌లు కూడా సీబీఎఫ్‌సీ పరిధిలోకి రావాలని క్వీన్ కంగ‌న‌ అభిప్రాయపడ్డారు. నిజాయితీగా చెప్పాలంటే సెన్సార్ బోర్డ్ అనవసరమైన సంస్థగా మారింది. మొన్నటి పార్లమెంట్ సెషన్‌లో కూడా నేను ఇదే విషయాన్ని లేవనెత్తాను అని కంగనా అన్నారు.

యూట్యూబ్ ఓటీటీలు పిల్లలకు అనేక రకాల కంటెంట్‌లకు యాక్సెస్ ఇవ్వడం చింతించ‌ద‌గిన‌ది అని కూడా కంగ‌న‌ అభిప్రాయపడింది. ఓటీటీలో చూపించే విషయాలు... పిల్లలు వీక్షించేవి.. చాలా ఆందోళన కలిగిస్తున్నాయి.. అని కంగ‌న అన్నారు.

పార్లమెంట్‌లో తన డిమాండ్ ని వినిపించాన‌ని..దేశ సంక్షేమం కోసం OTT వీలైనంత త్వరగా సెన్సార్‌షిప్ పొందాల‌ని ఆశిస్తున్నాను అని కంగ‌న‌ చెప్పింది. కంగనా రనౌత్ న‌టించిన `ఎమర్జెన్సీ`కి సెన్సార్ రాక‌పోవ‌డంపై విచారం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న సినిమా రిలీజ్ ఆల‌స్యం కావ‌డంతో ముంబైలోని త‌న సొంత భ‌వంతిని అమ్ముకోవాల్సి వ‌చ్చింది.