Begin typing your search above and press return to search.

సెన్సార్ తీరుపై కంగ‌న అవేద‌న‌!

కంగ‌నా ర‌నౌత్ స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన‌ `ఎమ‌ర్జెన్సీ` మ‌రోసారి వాయిదా ప‌డింది.

By:  Tupaki Desk   |   2 Sep 2024 9:30 AM GMT
సెన్సార్ తీరుపై కంగ‌న అవేద‌న‌!
X

కంగ‌నా ర‌నౌత్ స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన‌ `ఎమ‌ర్జెన్సీ` మ‌రోసారి వాయిదా ప‌డింది. ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డిన చిత్రం తాజాగా మ‌రోసారి వాయిదా ప‌ర్వాన్ని కొన‌సాగిస్తుంది. మ‌ళ్లీ రిలీజ్ ఎప్పుడన్న‌ది కంగ‌న రివీల్ చేస్తే త‌ప్ప క్లారిటీ రాదు. సినిమా కి సెన్సార్ బోర్డ్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో వాయిదా ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో కంగ‌న సెన్సార్ తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.

`నా సినిమాపై కూడా ఎమ‌ర్జెన్సీ విధించారు. ఇది విచార‌క‌ర‌మైన ప‌రిస్థితి. తీవ్ర నిరాశ‌కు గుర‌య్యాను. దేశంలో చ‌ట్టం ఎలా ఉందంటే? ఓటీటీ రిలీజ్ కి ఎలాంటి సెన్సార్ ఉండ‌దు. హింస, అశ్లీల‌త‌ను ప్ర‌ద‌ర్శిం చ‌వ‌చ్చు. రాజ‌కీయంగా ప‌లుకుబ‌డి ఉంటే? నిజ జీవిత సంఘ‌ట‌న‌లు కూడా వ‌క్రీక‌రించి సినిమాలు తీయోచ్చు. ఓటీటీల్లో అంత స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఆ స్వేచ్ఛ మాలాంటి వాళ్ల‌కు కోంచెం కూడా ఉండ‌దు.

అందుకే భార‌త‌దేశ స‌మగ్ర‌త‌, ఐక్య‌త చుట్టూ తిరిగే చిత్రాల‌ను తీయ‌డానికి మ‌న‌లో కొంత మందికి మాత్ర‌మే సెన్సార్ షిప్ ఉంది. ఇది అన్యాయం. నేను ఆత్మ‌గౌర‌వంతో ఈ చిత్రాన్ని నిర్మించాను. సెన్సార్ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌క‌పోతే కోర్టు పోరాటానికి వెనుకాడ‌ను` అని హెచ్చ‌రించారు. మొత్తానికి కంగ‌న‌కి సెన్సార్ నుంచి కూడా షాక్ త‌గిలింది.

ఇప్ప‌టికే చిత్రాన్ని తెలంగాణ స‌హా ప‌లు రాష్ట్రాలు నిషేదించాల‌నే అంశాన్ని తెర‌పైకి తెచ్చిన సంగ‌తి తెలిసిందే. సినిమాలో పాత్ర‌ల్ని త‌ప్పుగా చూపిస్తే ఊరుకోమంటూ హెచ్చ‌రిక‌లు ఎదుర్కుంది. మ‌రికొంత మంది అత్యాచారం చేసి చంపేస్తాన‌ని బెదిరించిన సంగ‌తి తెలిసిందే.