Begin typing your search above and press return to search.

లవ్‌ అని కంగనాకి ఎంపీ లేఖ..!

ఎమర్జెన్సీ సినిమాకి ఓటీటీ ద్వారా వస్తున్న స్పందనతో కంగనా చాలా సంతోషంగా ఉంది.

By:  Tupaki Desk   |   18 March 2025 3:29 PM IST
లవ్‌ అని కంగనాకి ఎంపీ లేఖ..!
X

హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఇప్పుడు పార్లమెంట్‌ మెంబర్‌. గతంలో మాదిరిగా వరుస సినిమాలు చేయకుండా ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటుంది. ఇటీవలే ఈమె నటించిన ఎమర్జెన్సీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా థియేటర్‌లలో పెద్దగా ఆధరణ సొంతం చేసుకోలేక పోయింది. దేశవ్యాప్తంగా విడుదలైన ఆ సినిమా దారుణమైన వసూళ్లు నమోదు చేసింది. గతంలో కంగనా చేసిన సినిమాల వసూళ్లతో పోల్చితే ఎమర్జెన్సీ సినిమా వసూళ్లు చాలా చాలా తక్కువ. కానీ ఓటీటీ వేదికగా ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఎంతో మంది సోషల్‌ మీడియా ద్వారా కంగనాను ప్రశంసిస్తూ సినిమా గురించి కామెంట్‌ చేస్తున్నారు.


ఎమర్జెన్సీ సినిమాకి ఓటీటీ ద్వారా వస్తున్న స్పందనతో కంగనా చాలా సంతోషంగా ఉంది. సినిమాకు సెలబ్రెటీల నుంచి వస్తున్న స్పందనను రెగ్యులర్‌గా కంగనా సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తూ వస్తుంది. ఆ మధ్య ఒక హీరోయిన్‌ ఎమర్జెన్సీ పై చేసిన పాజిటివ్‌ కామెంట్స్‌ను కంగనా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు మరో ప్రశంసను కంగనా షేర్ చేసింది. ఈసారి ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత ఒకరు ఎమర్జెన్సీ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ, చాలా బాగుంది అంటూ అభినందించాడు అంటూ కంగనా చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన లేఖను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది.

ఈ సినిమా ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా తీసింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సినిమాపై గత కొన్నాళ్లుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా ప్రతిపక్ష నాయకుడు సినిమా బాగుంది అంటూ కంగనాకు ప్రశంస లేఖ రాయడం చర్చనీయాంశం అయింది. ఇదెక్కడి విడ్డూరం అంటూ నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. ఇంతకు కంగనాకు ఎమర్జెన్సీ బాగుంది అంటూ లేఖ రాసిన ఆ నాయకుడు ఎవరు, అతడు ఎంపీ అయ్యి ఉంటాడా లేదంటే పార్టీ నాయకుడా అంటూ డీ కోడ్‌ చేసేందుకు నెటిజన్స్ జుట్టు పీక్కుంటున్నారు. లెటర్‌ పై ఉన్న సంతకంను గుర్తించేందుకు సోషల్‌ మీడియాలో ఒక వర్గం వారు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

కంగనా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన లేఖలో.. నిన్న ఎమర్జెన్సీ సినిమాను చూశాను. మీరు చాలా బాగున్నారు. లవ్‌ అని అతడి సైన్ ఉంది. ఈ లేఖతో తన మొహంలో చిరునవ్వు వచ్చిందని కంగనా చెప్పుకొచ్చింది. కంగనా ఎమర్జెన్సీని ప్రశంసించిన ఆ ప్రతిపక్ష నేత ఎవరు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఈ సినిమా గురించి సోషల్‌ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. దాంతో ఓటీటీలో ఈ సినిమాను మరింత ఎక్కువ మంది చూసే అవకాశాలు ఉన్నాయి. ఎమర్జెన్సీ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మార్చి 14 నుంచి స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమాకు మంచి స్పందన దక్కింది. ముందు ముందు ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్‌ కావడం ఖాయం అంటూ నెట్‌ఫ్లిక్స్ వర్గాల వారు చెబుతున్నారు.