కంగనకు నాన్- బెయిలబుల్ వారెంట్? ఏం జరుగుతుంది?
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారం చేసుకొని రూపొందిన ఈ సినిమా ఎట్టకేలకు జనవరి 17వ తేదీన రిలీజ్ అయింది.
By: Tupaki Desk | 6 Feb 2025 8:31 AM GMTబాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ రీసెంట్ గా ఎమర్జెన్సీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారం చేసుకొని రూపొందిన ఈ సినిమా ఎట్టకేలకు జనవరి 17వ తేదీన రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద మిక్సడ్ రెస్పాన్స్ అందుకుంది ఎమర్జెన్సీ మూవీ.
ప్రస్తుతం మాధవన్ తో మూవీ చేస్తున్న ఆమె.. రీసెంట్ గా ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టిన సంగతి విదితమే. ది మౌంటైన్ స్టోరీ పేరుతో హిమాలయాల్లో ఏర్పాటు చేసిన కేఫ్.. ఫిబ్రవరి 14వ తేదీన ఓపెన్ కానుంది. తన చిన్ననాటి కల ఎట్టకేలకు ప్రాణం పోసుకుందని, చాలా హ్యపీగా ఉన్నట్లు సోషల్ మీడియాలో కంగనా పోస్ట్ చేశారు.
అదే సమయంలో కంగనా రనౌత్ చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బాలీవుడ్ గేయ రచయిత జావేద్ అక్తర్.. ఇటీవల పోలీసులను.. ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలని కోర్టును కోరారు.
కోర్టు హాజరు మినహాయింపు కోరుతూ కంగనా దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసినా ఆమె.. న్యాయస్థానానికి వెళ్లనట్లు తెలుస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం, కంగనా చాలా తక్కువ సార్లు కోర్టుకు హాజరయ్యారు. దీంతో బాంద్రా కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయడానికి ముందు సమాధానం ఇవ్వడానికి చివరి అవకాశాన్ని ఇచ్చింది.
ఇటీవల ఆమె హాజరు కాకపోవడానికి పార్లమెంటరీ బాధ్యతలని చెప్పారు ఆమె న్యాయవాది. అయితే చివరి అవకాశాన్ని బాంద్రా కోర్టు ఇవ్వగా.. ఆమె హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత అరెస్టు అయ్యి జైలుకు వెళ్లే ఛాన్స్ కూడా కనిపిస్తుంది.
అయితే 2016 మార్చిలో ముంబైలో జావేద్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశం అనంతరం కంగనకు ఆయనకు మధ్య వివాదం మొదలై కేసుల వరకు వెళ్లింది. ఆ తర్వాత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అంశం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కంగనా.. జావేద్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పుడు తన ప్రతిష్ఠను దెబ్బతీశారని పేర్కొంటూ కంగనాపై ఆయన పరువు నష్టం దావా వేశారు. ప్రస్తుతం ఆ కేసులోనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయనున్నారు పోలీసులు! మరి కంగనా ఎలా డీల్ చేస్తారో చూడాలి