Begin typing your search above and press return to search.

ఆ కార‌ణంగానే నా బంగ్లా అమ్మేసాను

ఇటీవ‌ల కంగ‌నా ర‌నౌత్ ముంబై బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతంలోని బంగ్లాను అమ్మిన‌ట్లు వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Sep 2024 9:30 AM GMT
ఆ కార‌ణంగానే నా బంగ్లా అమ్మేసాను
X

ఇటీవ‌ల కంగ‌నా ర‌నౌత్ ముంబై బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతంలోని బంగ్లాను అమ్మిన‌ట్లు వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. స‌డెన్ గా ఆమెకు డ‌బ్బు అవ‌స‌రం ప‌డ‌టంతో సినిమా కోసం 32 కోట్ల‌కు అమ్మేసిన‌ట్లు నెట్టింట ప్ర‌చారం సాగింది. తాజాగా ఈ ప్ర‌చారంపై కంగ‌న స్పందించింది. `అవును అమ్మిన మాట వాస్త‌వ‌మే. నా దృష్టిలో ఆస్తుల‌నేవి అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో ఆదుకునేవి. నేను స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన `ఎమ‌ర్జెన్సీ` విడుద‌ల కావాల్సి ఉంది.

కానీ అది విడుద‌ల కాలేదు. దీంతో బంగ్లాను అమ్మ‌క త‌ప్ప‌లేదు` అని అంది. `ఎమ‌ర్జెన్సీ` రిలీజ్ విష‌యంలో కంగ‌న ఇబ్బందులో ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. సినిమాలో వివాదాస్ప‌ద అంశాలున్నాయంటూ సెన్సార్ కూడా రిలీజ్ అవ్వ‌డానికి వీల్లేదంటూ బ్రేకులు వేసింది. లేదంటే సెప్టెంబ‌ర్ తొలి వారంలోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది. అప్ప‌టి నుంచి సెన్సార్ నుంచి ఎమ‌ర్జెన్సీని బ‌య‌ట‌కు తెచ్చే ప్ర‌యత్నాలు చేస్తోంది.

అలాగే పార్లమెంట్ స‌మావేశాల్లో కూడా ఓటీటీ లో రిలీజ్ అయ్యే కంటెంట్ కి సెన్సార్ షిప్ అవ‌స‌ర‌మ‌ని డిమాండ్ చేసారు.` యూట్యూబ్ వంటి మాధ్య‌మాలు పిల్ల‌లు చూస్తున్నారు. ఈ విష‌యంలో నేను భ‌య‌ప‌డుతున్నా. ఇది ఆందోళ‌న క‌లిగించే విష‌యం. హింస‌ను ప‌సి హృద‌యాల‌కు ఎందుకు పంపించాలి? సెన్సార్ బోర్తుతో నేను ఎన్నోసార్లు వాదించాను. మ‌నమంతా దీనిపై పున‌రాలోచించాలి` అని పార్ల‌మెంట్ లో మాట్లాడారు.

ఇక `ఎమ‌ర్జెన్సీ` విష‌యంలో కంగ‌న ఒంట‌రిగా పోరాటం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ నుంచి ఆమెకి ఎలాంటి మ‌ద్ద‌తు ద‌క్క‌లేదు. గ‌తంలో ఆమె ప‌లుమార్లు బాలీవుడ్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు..వివిధ ర‌కాల వివాదాస్ప‌ద అంశాల్లో వేలు పెట్ట‌డంతో కంగ‌నకి మ‌ద్ద‌తుగా ఎవ‌రూ ముందుకు రావ‌డం లేద‌న్న‌ది తెలిసిందే.