రెండేళ్ల క్రితం ప్రకటనకి ఇప్పటికి మోక్షం!
కానీ రెండేళ్ల క్రితం కమిట్ అయిన చిత్రాన్ని మాత్రం ఇప్పుడు పట్టాలెక్కిస్తుంది. విలక్షణ నటుడు మాధవన్-కంగన జోడీగా రెండేళ్ల క్రితం ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది.
By: Tupaki Desk | 29 Jan 2025 7:30 AM GMTబాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ కి సరైన సక్సెస్ పడి చాలా కాలా మవుతోంది. మంచి ప్రయత్నాలే చేస్తోంది గానీ ఫలిం చడం లేదు. `తను వెడ్స్ మను రిటర్న్స్` తర్వాత చాలా సినిమాలు చేసింది. `రంగూన్` , `మణికర్ణిక`, `తలైవి` లాంటి ప్రయత్నాలు మంచివే అయినా ఫలితాలు మాత్రం ఆశించిన విధంగా రాలేదు. ఇటీవలే `ఎమర్జెన్సీ`తోనూ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమా కూడా నిరాశనే మిగిల్చింది.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా కంగనకి కొత్త ఇమేజ్ తెచ్చి పెడుతుందంటే విమర్శలను తెచ్చి పెట్టింది. కానీ బాలీవుడ్ లో ఏ హీరోయిన్ చేయని వినూత్న ప్రయత్నాలు చేసింది మాత్రం కంగన మాత్రమే. ఆ రకంగా కంగన ని గట్స్ గల నాయికగానే చెప్పాలి. ఎన్నో సవాళ్ల మధ్య ఆయా చిత్రాలను ముగించి ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చింది. ఇదంతా గతం. మరి ప్రస్తుతం కంగన లైనప్ లో ఉన్న సినిమాల సంగతేంటి? అంటే కొత్త సినిమాలేవి కమిట్ అవ్వలేదు.
కానీ రెండేళ్ల క్రితం కమిట్ అయిన చిత్రాన్ని మాత్రం ఇప్పుడు పట్టాలెక్కిస్తుంది. విలక్షణ నటుడు మాధవన్-కంగన జోడీగా రెండేళ్ల క్రితం ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాలేదు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలు పెడుతు న్నట్లు కంగన ప్రకటించింది. విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్. రవీంద్రన్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసి ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాన్నున్నారు. కంగన-మాధవన్ అంటే హిట్ కాంబినేషన్. `తను వెడ్స్ మను`తో ఆ జోడీ హిట్ పెయిర్ గా నిలిచింది. రెండు భాగాలు మంచి విజయం సాధించాయి. ఇప్పుడు మూడవ భాగం కూడా ఇదే కాంబినేషన్ లో ఉంటుంది. సైకలాజికల్ థ్రిల్లర్ తర్వాత ఆ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది.