ఆ బాధ్యత ప్రజలకూ ఉండాలి : కంగనా
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ స్టార్ హీరోయిన్, పార్లమెంట్ మెంబర్ కంగనా రనౌత్ సినిమాల్లో మద్యం, డ్రగ్స్ విషయమై స్పందించింది.
By: Tupaki Desk | 14 Dec 2024 10:58 AM GMTబాలీవుడ్ ఫైర్ బ్రాండ్ స్టార్ హీరోయిన్, పార్లమెంట్ మెంబర్ కంగనా రనౌత్ సినిమాల్లో మద్యం, డ్రగ్స్ విషయమై స్పందించింది. పార్లమెంట్‌లో ఈ విషయాన్ని గురించి మాట్లాడుతారా అంటూ ఆజ్‌తక్ ఇంటర్వ్యూలో అడిగిన సమయంలో తాను ఒక్కదాన్ని మాత్రమే ఈ విషయం గురించి మాట్లాడితే సరిపోదు అని, ప్రజలకూ ఈ విషయంలో అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చింది. కొన్ని ప్రాంతాల్లో జానపద సంగీతంలోనూ మధ్యం గురించి పాటలు ఉంటాయి. కళలో భావోద్వేగం ముఖ్యమైనది. సినిమాల్లో సన్నివేశాల ఆధారంగానే పాటలు ఉంటాయి. పాటలు, సన్నివేశాల్లో అలా మాదక ద్రవ్యాలను వినియోగించడం చూపిస్తారు.
మద్యం, మాదకద్రవ్యాల వినియోగం ఆపేయాలి అంటే ప్రజల నుంచి సహకారం ఉండాలి. వారు బాధ్యత యుతంగా వ్యవహరించినప్పుడు మాత్రమే వాటి నివారణ జరిపే అవకాశాలు ఉంటాయి. నటీనటులు, ప్రభుత్వం, చిత్ర యూనిట్ సభ్యులతో పాటు ప్రజలు ఈ విషయంలో బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు మాత్రమే వాటి యొక్క నివారణకు సాధ్యం అనే అభిప్రాయంను ఆమె వ్యక్తం చేసింది. ప్రజలు బాధ్యతతో నడుచుకున్నప్పుడు మాత్రమే దేశంలో కొన్ని మార్పులు వస్తాయనే అభిప్రాయంను ఆమె వ్యక్తం చేశారు.
జాతీయ మీడియా సంస్థ ఆజ్‌తక్ సంస్థ నిర్వహించిన చర్చ కార్యక్రమంలో ఆమె అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించింది. ఈ విషయంలో బన్నీకి పూర్తిగా తన మద్దతు ఉంటుందని పేర్కొంది. ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది. థియేటర్ల మీద ధూమపానం, మద్యపానం కు సంబంధించిన ప్రకటనలు ఆపేయాలి. వాటిని రద్దీగా ఉండే ప్రాంతాల్లో కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం కనుక ప్రభుత్వాలతో పాటు, ప్రతి ఒక్కరు ఈ విషయమై జాగ్రత్తగా వ్యవహరించడంతో పాటు స్వీయ నియంత్రణ అవసరం అంది.
హీరోయిన్‌గా ఎమర్జెన్సీ సినిమాను చేసిన కంగనా రనౌత్ ఆ సినిమా విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది. స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఆ సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయి అంటూ కొందరు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సెన్సార్ సంబంధిత విషయాల్లో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. అందుకే కంగనా ఆ సినిమాను విడుదల వాయిదా వేస్తూ వచ్చింది. ఆ సినిమాను కచ్చితంగా పెద్ద ఎత్తున విడుదల చేయాలనే పట్టుదలతో కంగనా ఉంది. ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అంటూ ప్రకటించింది.