Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ ఆఫీస్ ముందు రేంజ్ రోవ‌ర్!

ఖ‌రీదైన ల‌గ్జ‌రీ కార్లు త‌మ స్టేట‌స్ ను తెలిజ‌యేసే సంకేతం గానూ చాలా మంది సెల‌బ్రిటీలు భావిస్తుంటారు.

By:  Tupaki Desk   |   30 Sep 2024 6:45 PM GMT
ఆ హీరోయిన్ ఆఫీస్ ముందు రేంజ్ రోవ‌ర్!
X

సెల‌బ్రిటీల ఇంట కొత్త కారుల హంగామా కొత్తేం కాదు. మార్కెట్ లోకి వ‌చ్చి న్యూ వేరియేంట్ కార్ల‌ను కొను గోలు చేయ‌డాన‌కి చాలా మంది సెల‌బ్రిటీలు ఇష్ట‌ప‌డ‌తారు. ఇంట్లో ఓనాలుగైదు కార్లు ఉన్నా? కొత్త కారు మోజులో కొని ఇంటి ముందు పెడుతుంటారు. ఖ‌రీదైన ల‌గ్జ‌రీ కార్లు త‌మ స్టేట‌స్ ను తెలిజ‌యేసే సంకేతం గానూ చాలా మంది సెల‌బ్రిటీలు భావిస్తుంటారు. కొంత మందికి కార్ల క‌లెక్ష‌న్ అంటే ఆస‌క్తి ఎక్కువ‌.

ఆ మ‌క్కుతోనూ కొంటుంటారు. తాజాగా బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ రేంజ్ రోవ‌ర్ కారు కొనుగోలు చేసింది. రేంజ్ రోవ‌ర్ అటోబ‌యోగ్రీఫీ ఎల్ డ‌బ్ల్యూ బీ అనే ల‌గ్జ‌రీ కారు కొంది. మార్కెట్ లో దీని ధ‌ర 3.81 కోట్ల‌గా ఉంది. మ‌రి ఇప్పుడు కారు ఉన్న‌ప‌ళంగా కంగ‌న ఎందుకు కొన్న‌ట్లు? ఆమె ఆడంబ‌రాల‌కుపోయే న‌టి కాదు. సింపుల్ గా ఉంటుంది. అలాంటి న‌టి ఉన్న కార్లుతో స‌ర్దుకోవ‌డం లేదా? అంటే సంగ‌తి అది కాదు.

ఈ కారు కొన‌డానికి కొన్నికార‌ణాలున్నాయి. తన ఆఫీస్ అవ‌స‌రాల కోసం కొన్నాది. ఉన్న కార్లు వివిధ ప‌నుల్లో బిజీగా తిర‌గ‌డంతో? ఆఫీస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి కారు ఇబ్బంది ఎదుర‌వ్వడంతో కంగ‌న అప్ప‌టి క‌ప్పుడు ఈ కారు కొన్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే ముంబైలోని పాలేహిల్స్ లోని ఓ బంగ్లాను కంగ‌న 32 కోట్ల‌కు అమ్మేసిన సంగ‌తి తెలిసిందే. డ‌బ్బు అవ‌స‌రం ప‌డ‌టంతో కంగ‌న ఆ ప్లాట్ అమ్మాల్సి వ‌చ్చింది.

ఇప్పుడా డ‌బ్బులో మూడు కోట్ల‌తో ఈ కారును కొన్న‌ట్లు తెలుస్తోంది. ఈ మ‌ధ్య కాలంలో కంగ‌న వ‌రుస‌గా సొంత బ్యాన‌ర్లోనే సినిమాలు నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తీసేవ‌న్నీ భారీ బ‌డ్జెట్ చిత్రాలే. ప్ర‌స్తుతం తెర‌కెక్కించిన `ఎమ‌ర్జెన్సీ` కూడా తానే స్వ‌యంగా నిర్మించింది. ఈ సినిమా రిలీజ్ కు అడ్డంకులు ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే.