సెన్సార్ సూచనలపై కంగన ఏమన్నారంటే?
సెన్సార్ మాత్రం కట్స్ అనంతరమే రిలీజ్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
By: Tupaki Desk | 28 Sep 2024 7:30 AM GMTవివాదాస్పద సన్నివేశాలున్నాయంటూ కంగనా రనౌత్ స్వీయా దర్శకత్వంలో నిర్మించిన `ఎమర్జెన్సీ` రిలీజ్ కి అడ్డంకులు ఏర్పడిన సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో సినిమాపై నిరసనలు వ్యక్తమవ్వగా...సెన్సార్ బోర్డ్ సైతం అడ్డు చెప్పింది. ఓ వర్గం ప్రజల్ని కించ పరిచే సన్నివేశాలున్నాయంటూ ఆరోపణలున్నాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ఆధారంగా చేసుకుని తెరకెక్కించడంతోనే? ఇన్ని రకాల అడ్డంకులు ఎదురవుతున్నాయి.
సెన్సార్ మాత్రం కట్స్ అనంతరమే రిలీజ్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ సందర్భంగా కంగన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `సినిమాలో కొన్ని సన్నివేశాలు తొలగించాలని చెప్పిన విషయాలను స్వాగతిస్తున్నాం. కానీ మీరు చెప్పిన కొన్నిసూచనలు అర్దవంతంగా అనిపించడం లేదు. ఇప్పటికే కొంతమంది ప్రతిభావంతులు మా చిత్రాన్ని చూసి ప్రశంసించారు. ఏ విషయంలోనూ రాజీ పడకుండా నిజాయితీగా సినిమా తీసారని అభినందించారు.
వారి ఆమోదం ప్రోత్సాహకరంగా ఉంది. మేము ఈ కథని తగిన విధంగా గౌరవించామని నమ్ముతున్నాం. అందుకే నేను..మా చిత్రబృందం మా సినిమాని రక్షించడానికి సిద్దంగా ఉన్నాం` అన్నారు. కంగన మాటల్ని బట్టి సెన్సార్ కట్స్ కి ఆమె అంగీకరించనట్లు కనిపిస్తుంది. నిజాయితీగా చేసిన ప్రయత్నాన్ని మీరెందుకు ప్రోత్సహించడం లేదు? సినిమా రక్షించడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు.
అంటే కట్స్ విషయంలో కంగన వెనక్కి తగ్గేటట్లు కనిపించలేదు. తాను తీసింది యధావిధిగా విడుదల చేసే వరకూ ఊరుకునేలా కనిపించలేదు. మరేం జరుగుతందన్నది చూడాలి. ఈనెలలోనే రిలీజ్ అవ్వాల్సిన సినిమా సెన్సార్ కారణంగానే రిలీజ్ అవ్వలేదు. ప్రస్తుతం కంగన ఎన్డీయేలో ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే.