బాలీవుడ్ హీరోయిన్లపై కంగన సంచలన వ్యాఖ్యలు!
తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీలలో మీకు ఎవరైనా స్నేహితులు ఉన్నారా? అన్నందుకు అమ్మడు తనదైన శైలిలో విరుచుకుపడింది.
By: Tupaki Desk | 18 Aug 2024 10:30 AM GMTబాలీవుడ్ నటి కంనగా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యల గురించి చెప్పాల్సిన పనిలేదు. దాడికి ప్రతి దాడి ఆమె నైజం. ప్రత్యర్ధి ఎంతటి బలమైన వాడైనా సరే తనదైన శైలిలో ధీటైన బధులివ్వడం కంగన ప్రత్యేకత. కంగనతో పెట్టుకుంటే సీన్ సితారే అన్న సందర్భహాలు కోకొల్లలు. ఇప్పటికే బాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులపై కౌంటర్ ఎటాక్ తో చుక్కలు చూపించిన సందర్భాలెన్నో.
తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీలలో మీకు ఎవరైనా స్నేహితులు ఉన్నారా? అన్నందుకు అమ్మడు తనదైన శైలిలో విరుచుకుపడింది. `నేను బాలీవుడ్ కి సూటయ్యే వ్యక్తిని కాదు. అందుకే నాకు ఇక్కడ స్నేహితులు లేరు. వాళ్లందరి లైఫ్ స్టైల్ వేరు. నాది వేరు. షూటింగ్ లేకపోతే ఉదయం జిమ్ చేయడం, మధ్నాహ్నం నిద్రపోవడం, మళ్లీ సాయంత్రం జిమ్ కి వెళ్డం, టీవీ చూడటం పడుకోవడం ఇదే వారి దినచర్య.
అంతకు మించి వారికేం తెలియదు. అలాంటి వారితో స్నేహం ఎలా చేయగలను? సమాజంలో ఏం జరుగుతుందో పట్టించుకోరు. ఎప్పుడూ వాళ్ల గోలే ఉంటుంది. ఖరీదైన బట్టలు, ఆభరణాలు ధరించడం వాటి గురించి మాట్లాడుకోవడం ఇదే చర్చ ఉంటుంది. మిగతా సమాజం విషయాలు వాళ్లకు అనవ సరమైనవి. వీటికి భిన్నంగా కనిపించే వ్యక్తి బాలీవుడ్ లో కనిపిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
ఇక పార్టీల సమయంలో వారు మాట్లాడుకునే మాటలు ఎంతో ఇబ్బందిగా అనిపిస్తాయి. పార్టీలంటూ నా వరకూ ఓ ట్రామా లాంటివి` అని పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి వీటిపై బాలీవుడ్ నుంచి ఏ నటి అయినా రియాక్ట్ అవుతుందా? అన్నది చూడాలి. ప్రస్తుతం కంగన `ఎమర్జన్సీ` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.