Begin typing your search above and press return to search.

స‌హ‌నటిపై త‌ప్పుడు కామెంట్ ప‌ర్య‌వ‌సానం

గ‌తంలో త‌న స‌హ‌చ‌ర‌ నటి ఊర్మిళ మటోండ్కర్ గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ సభ్యుల నుండి కంగ‌న‌ విమర్శలను ఎదుర్కొంది.

By:  Tupaki Desk   |   31 March 2024 6:34 AM GMT
స‌హ‌నటిపై త‌ప్పుడు కామెంట్ ప‌ర్య‌వ‌సానం
X

ఇటీవలే రాజకీయ రంగ ప్రవేశం చేసిన కంగనా రనౌత్ చుట్టూ ఇప్పుడు పొలిటిక‌ల్ వివాదాలు ముసురుకుంటున్నాయి. స్వ‌త‌హాగానే జోరుగా నాలుక‌ను ఇష్టానుసారం విసిరేసే స్వభావం ఉన్న ఈ బ్యూటీ పాత వివాదాల‌తో కొత్త చిక్కులు తెచ్చుకుంటోంది. ప్ర‌త్య‌ర్థి పార్టీ నాయ‌కులు ప‌దే ప‌దే వీటిని కెలుకుతూ కంగ‌నను ఇర‌కాటంలో పెడుతున్నారు.

గ‌తంలో త‌న స‌హ‌చ‌ర‌ నటి ఊర్మిళ మటోండ్కర్ గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ సభ్యుల నుండి కంగ‌న‌ విమర్శలను ఎదుర్కొంది. ఇటీవల జరిగిన టైమ్స్ సమ్మిట్‌లో ఊర్మిళను 'సాఫ్ట్ పో* నటి'గా పేర్కొంటూ కంగనా చేసిన వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్ వ‌ర్గీయులు అట‌కాయిస్తున్నారు.

ఈ సమస్యను ప్రస్తావిస్తూ ఇలాంటి పదాలకు సామాజిక కళంకం అంటించ‌డం స‌రికాద‌ని సూచించే ప్ర‌య‌త్నం చేసింది. నీలిచిత్రాలు అనే ప‌దాన్ని క‌ళంకంగా భావించ‌డం స‌రికాద‌ని కూడా కంగ‌న త‌న ఉద్ధేశాన్ని చెప్పింది. వయోజన వినోద పరిశ్రమతో అనుబంధం ఉన్నప్పటికీ గౌరవాన్ని పొందుతున్న సన్నీ లియోన్ ను ఉదాహరించే ప్ర‌య‌త్నం చేసింది. సాఫ్ట్ *ర్న్ లేదా పో* స్టార్' అనే పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయా? అంటే ఇవి సామాజికంగా ఆమోదయోగ్యం కాని పదాలు. కానీ భారతదేశంలో శృంగార చిత్రాల న‌టీమ‌ణుల‌కు ఎంతగా గౌరవం లభిస్తుందో తెలుసు క‌దా!.. సన్నీ లియోన్‌ను అడగండి.. ప్రపంచంలో మరెక్కడా ఇలా లేదు! అని కంగ‌న వాదించింది.

ర‌క‌ర‌కాల క‌ళ‌ల్లో వ్య‌త్సాసం గురించి కంగ‌న వివ‌రించింది. 'మాసీ ఆర్ట్' అంటూ కొత్త ప‌దాన్ని ప‌రిచ‌యం చేసింది. మాసీ ఆర్ట్ అని పిలిచే దానికంటే మేధస్సును ఉత్తేజపరిచే పనికి ఎక్కువ ప్రాముఖ్యత ఉందని పేర్కొంది. తాను సినీప‌రిశ్ర‌మ‌లో మ‌రో ఊర్మిళ త‌ర‌హా అంటూ పోల్చింది. అంతేకాదు తాను 'ఐటెమ్ నంబర్‌'ల నుండి తప్పించుకోవడాన్ని హైలైట్ చేసింది. ఐట‌మ్ క్వీన్ అంటూ స్త్రీలను ఆక్షేపిస్తార‌ని కూడా పేర్కొంది కంగ‌న‌.

బాలీవుడ్‌లో న‌టీమ‌ణుల పాత్రపై చర్చలో కంగన ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల‌ను ట‌చ్ చేసింది. తందూరి ముర్గి, ఐటమ్ గర్ల్ వంటి పదాలను ఎందుకు అంగీకరిస్తారని సాటి నాయిక‌ల‌ను కంగ‌న‌ ప్రశ్నించింది. అయితే 'సాఫ్ట్ పో* యాక్టర్' అని పిలిస్తే విమ‌ర్శ‌లు ఎదుర‌వుతాయి.. తందూరీ ముర్గి, ఐటెం గర్ల్, షీలా కి జవానీ వంటి పదాలతో ఈ నటీమణులు సుఖంగా ఉంటే, దానిని (సాఫ్ట్ పో* యాక్టర్) నిషేధిస్తున్న‌ట్టు ఎందుకు చూస్తారు? నిజంగా అలాంటి వాళ్లు సుఖంగా ఉంటే.. వాళ్లను ఎందుకు సిగ్గు ప‌డేలా చేయాల‌నుకుంటున్నారు? అని సుదీర్ఘంగా క్లాస్ తీస్కుంది. నేను వ్యక్తిగతంగా ఎవ‌రినీ (ఊర్మిళా మటోండ్కర్) అవమానించే ఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్య చేయ‌లేదు. ఎందుకంటే ఆమె ఆ పాత్రలో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.. అని కాంప్లిమెంట్ ఇచ్చింది.

వివాదాస్పదంగా మాట్లాడినా కానీ, ఊర్మిళలోని కళాత్మకత‌, న‌ట‌ సామర్థ్యాలపై కంగ‌న‌ గౌరవం వ్యక్తం చేసింది. సమ్మోహనాన్ని (ఆక‌ర్షించే స్వ‌భావాన్ని) చట్టబద్ధమైన కళగా అంగీకరిస్తాన‌ని అంది. కంగనా మాట్లాడుతూ ''నేను మీ కళను గౌరవిస్తాను.. సమ్మోహనం ఒక కళారూపం'' అని చెబుతాను. నేను మీ కళను గౌరవిస్తే, మీరు నా కళను ఎందుకు గౌరవించరు? అంటూ ప్ర‌శ్నార్థ‌కంతో త‌న సుదీర్ఘ వివ‌ర‌ణ‌ను కంగ‌న ముగించింది.