Begin typing your search above and press return to search.

ఎంపీ మేడం సినిమా కొత్త రిలీజ్ డేట్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ కంగనా రనౌత్‌ ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి అధికార పార్టీ బీజేపీ ఎంపీగా గెలుపొందిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   25 Jun 2024 7:39 AM GMT
ఎంపీ మేడం సినిమా కొత్త రిలీజ్ డేట్‌
X

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ కంగనా రనౌత్‌ ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి అధికార పార్టీ బీజేపీ ఎంపీగా గెలుపొందిన విషయం తెల్సిందే. రాజకీయాల్లో అడుగు పెట్టినా కూడా సినిమాలు చేస్తానంటూ ఆ మధ్య ప్రకటించిన కంగనా రనౌత్‌ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

ఎంపీగా ఎన్నిక అయిన కంగనా రనౌత్‌ ప్రస్తుతం నియోజక వర్గ పనులతో పాటు, రాజకీయాల్లో అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ఆమె నటిస్తున్న ఎమర్జెన్సీ సినిమా పనులను కూడా చూస్తుంది. కంగనా దర్శకత్వంలో వస్తున్న రెండో సినిమా ఎమర్జెన్సీ అనే విషయం తెల్సిందే.

స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న కంగనా రనౌత్‌ ఎమర్జెన్సీ తో ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ రాజకీయాలతో కంగనా బిజీగా ఉండటంతో పాటు పలు ఇతర కారణాల వల్ల ఎమర్జెన్సీ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది.

కంగనా ఫ్యాన్స్ ఎప్పుడు ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందా అంటూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించారు. షూటింగ్‌ బ్యాలన్స్ ఉండటంతో పాటు, పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ కి కనీసం రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందట.

అందుకే ఈ సినిమాను సెప్టెంబర్‌ 6న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన కంగనా రనౌత్‌ వచ్చే నెల నుంచి ఎమర్జెన్సీ సినిమా పనులతో మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎమర్జెన్సీ సినిమా పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో విడుదల సమయంలో వివాదాస్పదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.