కంగన Vs జావేద్ అక్తర్.. హైకోర్టులో పంచాయితీ!
పాపులర్ బాలీవుడ్ గీత రచయిత, స్క్రీన్ ప్లే రైటర్ జావేద్ అక్తర్ తోను కంగన వైరం గురించి తెలిసిందే. చాలా కాలంగా ఈ ఇరువురి నడుమా కోర్టుల పరిధిలో పోరాటం కొనసాగుతోంది.
By: Tupaki Desk | 7 Jan 2024 6:17 AM GMTబాలీవుడ్ బడా బాబులతో 'టీజ్ అండ్ ప్లే గేమ్'లో క్వీన్ కంగన రనౌత్ పోరాట పటిమ ఎప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రోషన్‌లు, భట్స్ సహా ప్రముఖులందరికీ కంగన బద్ధ విరోధి. దీనికి తోడు మహారాష్ట్రలో పేరున్న రాజకీయ నాయకులతోను కంగన నిరంతరం గేమ్ ఆడుతోంది. ఈ సిమ్లా (హిమచల్ ప్రదేశ్) బ్యూటీ గట్స్ డేర్ ప్రతిసారీ జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్నాయి.
పాపులర్ బాలీవుడ్ గీత రచయిత, స్క్రీన్ ప్లే రైటర్ జావేద్ అక్తర్ తోను కంగన వైరం గురించి తెలిసిందే. చాలా కాలంగా ఈ ఇరువురి నడుమా కోర్టుల పరిధిలో పోరాటం కొనసాగుతోంది. జావేద్ అక్తర్ 2020లో కంగన రనౌత్‌పై పరువునష్టం ఫిర్యాదును దాఖలు చేశారు. జాతీయ అంతర్జాతీయ టెలివిజన్ లలో రనౌత్ పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేశారని సాధారణ ప్రజల దృష్టిలో (అక్తర్)ని కించపరిచే ఉద్ధేశమిదని ఆయన ఆరోపించారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత కంగన రనౌత్ ఇచ్చిన ఇంటర్వ్యూను అక్తర్ ప్రత్యేకంగా ప్రస్థావించారు.
అయితే జావేద్ అక్తర్‌పై క్వీన్ కంగన రనౌత్ కూడా తన గోప్యతకు భంగం కలిగించడం ద్వారా దోపిడీకి పాల్పడుతున్నాడని తన వినయాన్ని ఆక్షేపించాడని ఆరోపిస్తూ రివర్స్ కౌంటర్ వేసారు. జూలై 2023లో అంధేరిలోని మేజిస్ట్రేట్ కోర్టు జావేద్ అక్తర్‌పై ఉన్న దోపిడీ ఆరోపణలను కంగన ఉపసంహరించుకుంది. అయినప్పటికీ క్రిమినల్ బెదిరింపు , వేధింపుల నేరాలకు సంబంధించి హాజరు కావాల్సిందిగా అతడికి సమన్లు పంపారు. దీనికి వ్యతిరేకంగా జావేద్ అక్తర్ దిండోషిలోని సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. కంగన రనౌత్ ఫిర్యాదుకు సంబంధించి సెషన్స్ కోర్టు సమన్ల ఆర్డర్, క్రిమినల్ ప్రొసీడింగ్‌లపై స్టే విధించింది. దీనితో కలత చెందిన కంగన రనౌత్, అక్తర్ పరువునష్టం ఫిర్యాదుకు సంబంధించి విచారణపై స్టే కోరుతూ ఈ నెల ప్రారంభంలో హెచ్‌సిని ఆశ్రయించారు.
రెండు కేసులు ఒకే సంఘటన నుండి ఉద్భవించాయని, అందువల్ల విరుద్ధమైన తీర్పులను నివారించడానికి విచారణలు (రెండు కేసుల్లోను) ఒకేసారి కలిసి నిర్వహించాల్సిన అవసరం ఉందని కంగన తన పిటిషన్ లో పేర్కొన్నారు. తన ఫిర్యాదుకు సంబంధించి విచారణను స్వయంగా నిలిపివేసినప్పటికీ, అక్తర్ ఫిర్యాదుతో ఉత్పన్నమయ్యే విచారణపర్వం కొనసాగదని, సెషన్స్ కోర్టు ద్వారా పునర్విమర్శ దరఖాస్తును పరిష్కరించే వరకు వాటిని నిలిపివేయాలని కంగన వాదించారు. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా కోర్టు వారు తన విన్నపాన్ని పరిశీలించాలని కోరారు. జనవరి 9న హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారించే అవకాశం ఉంది.