మళ్లీ క్వీన్ అతడితో జత కడుతోందా?
బాలీవుడ్ క్వీన్ కంగనకు సరైన సక్సెస్ పడ చాలా కాలమవుతోంది. కంగన మార్క్ హిట్ ఎక్కడా అని భూతద్దం వేసి వెతకాల్సిన సన్నివేశం ఉంది.
By: Tupaki Desk | 17 March 2024 12:34 PMబాలీవుడ్ క్వీన్ కంగనకు సరైన సక్సెస్ పడ చాలా కాలమవుతోంది. కంగన మార్క్ హిట్ ఎక్కడా అని భూతద్దం వేసి వెతకాల్సిన సన్నివేశం ఉంది. `క్వీన్`..`తను వెడ్స్ మను` తర్వాత ఆ రేంజ్ హిట్ ఎక్కడా కనిపించలేదు. మణికర్ణిక లాంటి హిస్టారికల్ ప్రయత్నం చేసినప్పటికీ అది మంచి ప్రయత్నంగానే కనిపించింది తప్ప కాసులు అంతగా రాబట్టలేదు. ఇక మిగతా సినిమాల సంగతైతే చెప్పాల్సిన పనిలేదు.
అన్ని సినిమా వసూళ్లు కలుపుకుంటే 100 కోట్లు కూడా ఉండవు. ఒక్కో సినిమా 4 కోట్లు...ఐదు కోట్లు అంటే 10 కోట్ల లోపే వసూళ్లు కనిపిస్తున్నాయి. ఆ రకంగా కంగన కెరీర్ మూడు-నాలుగేళ్లగా మరితం డౌన్ ఫాల్ లోనే కనిపిస్తుంది. మధ్యలో తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ తో `తలైవి` అంటూ ఓ ప్రయత్నం చేసింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తలైవిగా తెచ్చింది కానీ సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పోటీ పడి ఫెయిలైనవే.
అయితే అదే కాంబినేషన్ ఇప్పుడు మరో సినిమా చేస్తున్నట్లు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వంలో మాధవన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోందిట. ఇందులో హీరోయిన్ గా కంగన ఎంపికైందంటూ ప్రచారం సాగుతోంది. ఆ సినిమాకి ఇంకా టైటిల్ పెట్టలేదు. సినిమా మాత్రం ఆన్ సెట్స్ లోనే ఉందని తెలిసింది. సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా పవర్ ఫుల్ గా ఉండటంతో దర్శకుడు కంగనని అప్రోచ్ అవ్వడంతో ఆమె కూడా పాత్ర నచ్చి ఒకే చెప్పినట్లు సమాచారం.
దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ప్రస్తుతం కంగన `ఎమర్జెన్సీ` చిత్రంలో నటిస్తో న్న సంగతి తెలిసిందే. కంగన స్వీయా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. దీంతో కంగన విజయ్ ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు తెలుస్తోంది. హిందీలో మాత్రం కొత్త ప్రాజెక్ట్ లు వేటికి సైన్ చేయలేదు. అలాగే అమ్మడు ఇటీవల బీజేపీ పార్టీలో కూడా చేరినట్లు తెలుస్తోంది.