Begin typing your search above and press return to search.

కంగ‌న చెంప దెబ్బ వెన‌క అస‌లు కార‌ణం?

కంగ‌న X లో పోస్ట్ చేసిన నోట్ లో పంజాబ్‌లో తీవ్రవాదం హింస దిగ్భ్రాంతికరంగా పెరిగాయ‌ని వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   7 Jun 2024 3:53 AM GMT
కంగ‌న చెంప దెబ్బ వెన‌క అస‌లు కార‌ణం?
X

క్వీన్ కంగ‌న ర‌నౌత్ మాట‌ల్లోనే కాదు చేత‌ల్లోను రాణి అని నిరూపించింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మండి నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ ప్ర‌త్య‌ర్థిపై భారీ ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. భాజ‌పా ఎంపీ కంగ‌న పై ఇప్పుడు ప‌బ్లిక్ ఫోక‌స్ మ‌రింత ఎక్కువైంది. ఇలాంటి స‌మ‌యంలో చంఢీఘ‌డ్ విమానాశ్ర‌యంలో మ‌హిళా కానిస్టేబుల్ కంగ‌న‌ను చెంప దెబ్బ కొట్ట‌డం సంచ‌ల‌న‌మైంది.

అయితే కానిస్టేబుల్ చెంప దెబ్బ వెన‌క రాజ‌కీయం ఏమిటి? అన్న‌ది ప్ర‌జ‌ల సందేహం. దీనికి కార‌ణం ఏమిట‌న్న‌ది కంగ‌న ఇంత‌కుముందు వివ‌ర‌ణ ఇచ్చింది. తాను రైతుల‌పై చేసిన కామెంట్ దీనికి కార‌ణ‌మ‌ని కూడా వ్యాఖ్యానించింది. ఇంత‌కుముందు భాజ‌పా ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయంపై సీఏఏ బిల్లును ప్ర‌వేశ పెట్టిన సంగ‌తి తెలిసిందే. దీనిని వ్య‌తిరేకిస్తూ సిక్కు రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసారు.

అయితే ఈ ఉద్య‌మంలో పాల్గొన్న‌వారిలో తీవ్ర‌వాదులు ఉన్నార‌ని, తీవ్ర‌వాదులు రైతులుగా చెలామ‌ణి అవుతున్నార‌ని కంగ‌న కామెంట్ చేసింది. వ్య‌వ‌సాయ బిల్లును వ్య‌తిరేకించేది ఈ తీవ్ర‌వాదులేనంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. దీనిపై పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త రావ‌డంతో కంగ‌న తాను ఆ తీవ్ర‌వాదులు అన‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చుకునే ప్ర‌య‌త్నం చేసింది. కానీ కంగ‌న వ్యాఖ్య సిక్కుల హృద‌యాల‌ను తీవ్రంగా గాయ‌ప‌రిచింది. దాని ప‌ర్య‌వ‌సానం ఇప్పుడు చెంప దెబ్బ రూపంలో బ‌య‌ట‌ప‌డింది.

అయితే చెంప దెబ్బ ఘ‌ట‌న త‌ర్వాత కంగ‌న మ‌రోసారి తీవ్ర‌వాదాన్ని ప్ర‌స్థావించ‌డం గ‌మ‌నార్హం. బీజేపీ నాయకురాలు, నటి కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఇలా అన్నారు. రూ. 100 కోసం రైతులు అక్కడ కూర్చున్నారని కంగ‌న‌ స్టేట్‌మెంట్ ఇచ్చింది. డ‌బ్బు కోసం తాము వెళ్లి అక్కడ కూర్చుంటామా? ఆమె ఈ స్టేట్‌మెంట్ ఇచ్చేటప్పుడు మా అమ్మ అక్కడ కూర్చుని నిరసన వ్యక్తం చేసింది.. అందుకే కొట్టాను! అని తెలిపింది.

కంగ‌న X లో పోస్ట్ చేసిన నోట్ లో పంజాబ్‌లో తీవ్రవాదం హింస దిగ్భ్రాంతికరంగా పెరిగాయ‌ని వ్యాఖ్యానించారు. తాను ప్ర‌స్తుతం సురక్షితంగానే ఉన్నాన‌ని, అయితే పంజాబ్‌లో పెరుగుతున్న ఉగ్రవాదం గురించి ఆందోళన చెందుతున్నట్లు కంగ‌న‌ పేర్కొంది. కానిస్టేబుల్ నా ముఖం మీద కొట్టి నన్ను దుర్భాషలాడడం ప్రారంభించింది. ఆమె ఎందుకు అలా చేసిందో అడిగాను. రైతుల నిరసనలకు తాను మద్దతు ఇస్తున్నంద‌న కొట్టిన‌ట్టు చెప్పిందని కంగ‌న తెలిపింది.