Begin typing your search above and press return to search.

అమ్మ‌కానికి హీరోయిన్ ఇల్లు..ఆఫీస్!

బాలీవుడ్ న‌టి కంగ‌నా రనౌత్ త‌న ఆస్తుల్ని అమ్మ‌కానికి పెట్టిందా? అంటే అవున‌నే ప్ర‌చారం సాగుతోంది

By:  Tupaki Desk   |   5 Aug 2024 6:10 AM GMT
అమ్మ‌కానికి హీరోయిన్ ఇల్లు..ఆఫీస్!
X

బాలీవుడ్ న‌టి కంగ‌నా రనౌత్ త‌న ఆస్తుల్ని అమ్మ‌కానికి పెట్టిందా? అంటే అవున‌నే ప్ర‌చారం సాగుతోంది. అమ్మ‌డు ముంబైలో ని త‌న ఇంటిని, బాంద్రాలో సినిమా ఆఫీస్ ని అమ్మేందుకు బేరం పెట్టిన‌ట్లు బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. బాంద్రాలోని 3042 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో రెండు అంత‌స్తుల భ‌వనం అమ్మేందుకు బేరం పెట్టింది. దీని ధ‌ర 40 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా.

ఆ మొత్తాన్ని మార్కెట్ లో బేరం పెట్టిన‌ట్లు స‌మాచారం. మ‌రి ఉన్న ప‌ళంగా కంగ‌న ఎందుకు ఆస్తుల్ని అమ్ముతుంది? అన్న వివ‌రాలు మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ఈ ప్ర‌చారంపై కంగ‌న కూడా ఇంత వ‌ర‌కూ స్పందించ‌లేదు. ఇక కంగన‌ కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొన‌సాగుతుంది. లేడీ ఓ రియేంటెడ్ చిత్రాల‌తోనూ బాక్సాఫీస్ వ‌ద్ద సోలోగా స‌త్తా చాట‌గ‌ల న‌టి.

ఒక్కో సినిమాకి కోట్ల రూపాయాలు పారితోషికం తీసుకుంటుంది. సొంతంగా మ‌ణిక‌ర్ణిక ఫిలింస్ పేర‌టి బ్యాన‌ర్ కూడా స్థాపించింది. ఆ సంస్థ‌లోనే అమ్మ‌డు భారీ బ‌డ్జెట్ సినిమాలు నిర్మిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే బ‌య‌ట బ్యాన‌ర్ల‌లో సినిమాలు చేయ‌డం కూడా త‌గ్గించింది. ఇటీవ‌లే రాజ‌కీయాల్లోకి కూడా అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. బీజేపీ పార్టీ నుంచి మండి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఎంపీ అభ్య‌ర్ధిగా గెలిచింది.

ప్ర‌స్తుతం సినిమాల‌కు బ్రేక్ ఇచ్చి రాజ‌కీయాల్లోనే బిజీగా ఉంది. అయితే రాజ‌కీయ తెరంగేట్రానికి ముందే ఎమ‌ర్జ‌న్సీ చిత్రాన్ని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. స్వీయా ద‌ర్శ‌క‌త్వంలోనే ఈ సినిమా నిర్మిస్తుంది. ఇప్ప‌టికే రిలీజ్ అవ్వాలి. కానీ మ‌ధ్య‌లో రాజ‌కీయాల్లో బిజీ అవ్వ‌డంతో ప్రాజెక్ట్ పూర్తి చేయ‌డంలో జాప్యం జ‌రిగింది. దీంతో అన్ని ప‌నులు పూర్తి చేసి చిత్రాన్నిసెప్టెంబ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.