Begin typing your search above and press return to search.

రాజ‌కీయాల ముందు సినిమా క‌ష్టం ఓ జోక్!

తాజాగా కంగ‌న ర‌నౌత్ ఈ ప‌ర్య‌ట‌న‌ని ఉద్దేశించి ట్విట‌ర్ లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

By:  Tupaki Desk   |   18 May 2024 10:15 AM GMT
రాజ‌కీయాల ముందు సినిమా క‌ష్టం ఓ జోక్!
X

బాలీవుడ్ న‌టి హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని మండి నియోజ‌క వ‌ర్గం నుంచి బీజేపీ త‌రుపున లోక్ స‌భ‌కు పోటీ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని రోజులుగా ఎన్నికల ప్ర‌చారంలోనే బిజి బిజీగా ఉంది. గెలుపు కోసం తాను చేయాల్సిన అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తోంది. బీజేపీ పార్టీ తన‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకునేందుకు శ‌క్తివంచ‌న లేకుండా శ్ర‌మిస్తుంది. త‌న బృందంతా క‌లిసి విస్తృతంగా నియోజ‌క వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తుంది. తాజాగా కంగ‌న ర‌నౌత్ ఈ ప‌ర్య‌ట‌న‌ని ఉద్దేశించి ట్విట‌ర్ లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

'వ‌రుస రోడ్ షోలు..వంద‌ల కిలోమీట‌ర్ల ప్ర‌యాణం..సమావేశాలు..నిద్ర‌లేని రాత్రుళ్లు..స‌మ‌యానికి భోజ‌నం తిన‌క పోవ‌డం ఇలా ఎన్నో చూసాను. వీటి ముందు సినిమా తీయ‌డానికి ప‌డే క‌ష్టాలు ఓ జోక్ లాంటివి. ఆ రెండింటి క‌ష్టాన్ని ఏమాత్రం పోల్చ‌డానికి వీలులేదు' అని రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. అభిమానులు.. నెటి జ‌నులు కంగ‌న పోస్ట్ పై ఆస‌క్తిక‌ర కామెంట్లు పెడుతున్నారు. రాజ‌కీయాల గురించి చాలా త్వ‌ర‌గానే అర్దం చేసుకుంద‌ని...అందుకే వాస్త‌వాన్ని గ్ర‌హించింద‌ని ఓ యూజ‌ర్ పోస్ట్ చేసాడు.

మ‌రికొంత మంది ప్ర‌జాక్షేత్రంలో తిర‌గ‌డంలో ఇప్పుడే మొద‌లు పెట్టారు కదా. రాను రాను ఇంకా చాలా విష‌యాలు అర్ద‌మ‌వుతాయి. అవి మీరు మ‌రంత త్వ‌ర‌గా గ్ర‌హించ‌గ‌ల‌రు. ఆఫ్ ది స్క్రీన్ ప్ర‌త్య‌ర్ధుల‌పై తిర‌గ‌బ‌డిన‌ట్లే రాజ‌కీయాల్లోనూ తిర‌గ‌బ‌డితే మీరు గెలిచిన‌ట్లే అంటూ మ‌రొక‌రు రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం కంగ‌న సినిమాల‌కు బ్రేక్ ఇచ్చింది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో 'ఎమ‌ర్జెన్సీ' తెర‌కెక్కుతోన్న‌ సంగ‌తి తెలిసిందే.

ఆ సినిమా షూటింగ్ కూడా పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ముగింపు కు చేరుకున్నాయి. రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. కానీ కంగ‌న రాజ‌కీయ ప్ర‌చారంలో బిజీగా ఉండ‌టంతో రిలీజ్ వాయిదా వేసారు. ఎన్నిక‌ల త‌ర్వాత కంగ‌న సినిమా ప్ర‌చారంలో పాల్గొంటుంది. రాజ‌కీయాల నేప‌థ్యంలోనే కంగ‌న కొత్త సినిమాలు వేటికి సైన్ కూడా చేయ‌లేదు.