Begin typing your search above and press return to search.

కంగన నటనకు స్వస్తి? ఇదిగో జ‌వాబు!

కంగన రనౌత్ ఈ ఏడాది రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. బీజేపీలో చేరి 2024 లోక్‌సభ ఎన్నికల్లో `మండి`(హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్‌) నుంచి పోటీ చేసింది

By:  Tupaki Desk   |   15 Aug 2024 1:37 PM GMT
కంగన నటనకు స్వస్తి? ఇదిగో జ‌వాబు!
X

కంగన రనౌత్ ఈ ఏడాది రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. బీజేపీలో చేరి 2024 లోక్‌సభ ఎన్నికల్లో `మండి`(హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్‌) నుంచి పోటీ చేసింది. ఆ స్థానంలో గెలిచి ఎంపీ కూడా అయ్యారు. రాజకీయాలకు సంబంధించిన పనులపై ఎక్కువ సమయం వెచ్చిస్తున్నందున, కంగన సినీ పరిశ్రమను వదిలేస్తుంద‌ని అభిమానులు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. తన కొత్త చిత్రం `ఎమర్జెన్సీ` ట్రైలర్ లాంచ్‌లో ఇదే ప్ర‌శ్న ఎదురైంది. దీనికి కంగనా మాట్లాడుతూ బాలీవుడ్‌లో తన భవిష్యత్తు తన ప్రేక్షకులపై ఆధారపడి ఉంటుంద‌ని అన్నారు.

నేను నటించడం కొనసాగించాలా వద్దా? అనేది ప్రజలు నిర్ణయిస్తార‌ని అనుకుంటున్నాను. నేను నాయకురాలిని అవుతాన‌ని ఎప్పుడూ చెప్పలేదు. మ‌నం నాయకులుగా ఉండాలని ప్రజలు చెప్పాలి. ఏ పార్టీ సర్వేలు చేసినా.. ఏ ప్రమాణం ప్రకారం టిక్కెట్ ఇవ్వాలన్నా.. నేను ఎన్నికల్లో పోరాడాలనేది ప్రజల అభీష్టం. రేపు `ఎమర్జెన్సీ` పని చేస్తే (విజ‌యం సాధిస్తే), వారు నన్ను ఎక్కువగా తెర‌పై చూడాలనుకుంటే.. నేను విజయం సాధించగలనని భావిస్తే.. సినిమాల్లో కొనసాగుతాను``అని తెలివిగా మాట్లాడింది కంగన.

నేను రాజకీయాల్లో ఎక్కువ విజయాన్ని సాధించానని.. ఈ విభాగంలో మరింత అవసరం అవుతాన‌ని ప్ర‌జ‌ల‌ భావిస్తే... మనకు అవసరమైన గౌరవం, విలువ ద‌క్కిన చోటికి మ‌నం వెళ్తాము. నా జీవితాన్ని నేను నిర్ణయించుకుంటాను. నేను ఇక్కడ ఉండాలా లేదా అక్కడకు వెళ్లాలా? అనేది ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తారు. నేను అవసరమైన చోట ఎక్కడైనా బాగానే ఉన్నాను! అని కంగ‌న‌ చెప్పింది.

ఎమర్జెన్సీ తర్వాత కంగనా ఇంకా త‌దుప‌రి సినిమాని ప్రకటించలేదు. ఈ చిత్రం సెప్టెంబరులో విడుదల కానుంది. 1975 నుండి 1977 మధ్య కాలంలో భారతదేశంలోని ఎమర్జెన్సీ స‌మ‌యంలో ఏం జ‌రిగింది? అన్న‌ది తెర‌పై చూపిస్తున్నారు. ఈ చిత్రంలో కంగనా ఇందిరా గాంధీ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో కంగనా నటించడమే కాకుండా స్వ‌యంగా ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించింది. కంగనా తన మణికర్ణిక ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. ట్రైల‌ర్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

ఎమర్జెన్సీలో అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, మహిమా చౌదరి, శ్రేయాస్ తల్పాడే తదితరులు నటించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రలో శ్రేయాస్ తల్పడే కనిపించనుండగా, జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్ కనిపించనున్నారు. దివంగత నటుడు సతీష్ కౌశిక్ భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్‌గా కూడా కనిపించనున్నారు.