కరణ్ జోహార్ పై కంగన పంచ్.. ఈపాటిదానికి 250కోట్లు దేనికి?
వివాదం ఎక్కడుందో కంగన అక్కడుంటుంది! ఎదుటివారు ఎంతటివారైనా విమర్శలతో చెలరేగిపోవడం తన అలవాటు. ప్రతిసారీ బాలీవుడ్ మాఫియా అంటూ కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాతనే బెంబేలెత్తిస్తోంది.
By: Tupaki Desk | 30 July 2023 4:52 AM GMTవివాదం ఎక్కడుందో కంగన అక్కడుంటుంది! ఎదుటివారు ఎంతటివారైనా విమర్శలతో చెలరేగిపోవడం తన అలవాటు. ప్రతిసారీ బాలీవుడ్ మాఫియా అంటూ కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాతనే బెంబేలెత్తిస్తోంది. ఇప్పుడు మరోసారి కరణ్ జోహార్ పై తనదైన శైలిలో విరుచుకుపడింది. ఇటీవలే కరణ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన `రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ` చిత్రాన్ని కంగన తీవ్రంగా విమర్శించింది.
ఇది ఒక టీవీ సీరియల్ ని తలపించే సినిమా.. మళ్లీ మళ్లీ రిపీటెడ్ స్టోరీనే కరణ్ ఎంచుకున్నాడని కంగన విమర్శలు ఎక్కుపెట్టింది. ఇలాంటి టీవీ సీరియల్ కోసం 250 కోట్ల భారీ బడ్జెట్ అవసరమా? అని కూడా పంచ్ విసిరింది. ఇక కరణ్ జోహార్ రిటైర్మెంట్ తీసుకోవాలని సంచలనాలు విప్లవాలను తెచ్చేందుకు నవతరం దర్శకనిర్మాతలు పరిశ్రమకు రావాలని కంగన సూచించింది.
రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ చెత్త సినిమా అని వ్యాఖ్యానించిన కంగన.. తొంభైల నాటి తన సినిమాలను తానే కాపీ చేసినందుకు దర్శకనిర్మాత కరణ్ జోహార్ సిగ్గుపడాలని అన్నారు. నేపో గ్యాంగ్ అంటూ చిత్రహీరో రణవీర్ ని టార్గెట్ చేసిన కంగన అతడు మగాడి వేషధారణలో కనిపించాలని కూడా సూచించింది. అలాగే క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్ సినిమాని భారతీయులు అధికంగా చూస్తున్నారని వ్యాఖ్యానించిన కంగన... యహాన్ నేపో గ్యాంగ్ కా వహీ సాస్ బహు క రోనా.. అంటూ ఘాటైన వ్యాఖ్యను చేసింది. ``కరణ్ జోహార్ ఇలా చేసినందుకు సిగ్గుపడుతున్నా. మిమ్మల్ని మీరు భారతీయ సినిమాకి పెద్ద దిక్కు అని పిలుచుకుంటూ శాశ్వత తిరోగమనానికి కారణమవుతున్నందుకు బాధగా ఉంద``ని కంగన వ్యాఖ్యానించింది. ``నిధులను వృధా చేయకండి.. పరిశ్రమకు ఇది అంత తేలికైన సమయం కాదు.. మీరు ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకోండి. యువ చిత్ర నిర్మాతలు కొత్త విప్లవాత్మక చిత్రాలను రూపొందించనివ్వండి..`` అంటూ కంగన పిలుపునిచ్చింది.
కాపీ చేసిన సెట్లతో దారుణమైన, సృజనాత్మకంగా పేలవమైన చిత్రాలను ప్రజలు ఎప్పుడూ తిరస్కరించారు. ఫేక్ కాస్ట్యూమ్‌లను తిరస్కరించారు. నిజ జీవితంలో కూడా ఇలాంటి దుస్తులు ధరించే వారు ఢిల్లీలో ఏ పనికిమాలిన ఇళ్ళలో ఉన్నారు? ఇదేమి చెత్త!!!! కరణ్ జోహార్‌కు సిగ్గుపడాలి.. తొంభైలలో తాను తీసిన పాతకాలపు సినిమాలను తానే కాపీ చేస్తూ... ఈ మూర్ఖత్వపు పనికి రూ. 250 కోట్లు ఎలా ఖర్చుపెట్టాడు? నిజమైన ప్రతిభ నిధుల కోసం కష్టపడుతుండగా వీళ్లకు(కరణ్‌కు) ఇంత డబ్బు ఎవరు ఇస్తారు !!! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది క్వీన్.