మగాడిలా కనిపించు.. స్టార్ హీరో పరువు తీసిన కంగన
నువ్వు మగాడిలా కనిపించు.. ఫ్యాషన్ పరంగా అతడి సలహాలు వినకు.. తెలుగు హీరోలను చూసి నేర్చుకో! అంటూ ప్రముఖ హీరోకి క్వీన్ కంగన సూచించడం నెటిజనుల్లో చర్చగా మారింది.
By: Tupaki Desk | 30 July 2023 5:52 AM GMTనువ్వు మగాడిలా కనిపించు.. ఫ్యాషన్ పరంగా అతడి సలహాలు వినకు.. తెలుగు హీరోలను చూసి నేర్చుకో! అంటూ ప్రముఖ హీరోకి క్వీన్ కంగన సూచించడం నెటిజనుల్లో చర్చగా మారింది. బాలీవుడ్ లో అగ్ర హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సదరు హీరో ఫ్యాషన్ సెన్స్ ఎనర్జీ గురించి నెటిజనుల్లో నిరంతరం చర్చ సాగుతుంటుంది. అయితే అతడి పోకడలు థర్డ్ మ్యాన్ పోకడలు అంటూ ఇంతకుముందు విమర్శలొచ్చాయి. ఇప్పుడు కంగన విసిరిన పంచ్ అతడిని సూటిగా తాకిందనే చెప్పాలి. ఇంతకీ ఈ ఎపిసోడ్ లో స్టార్ హీరో ఎవరు? అంటే.. నటుడు రణ్‌వీర్‌సింగ్‌కు క్వీన్ కంగన ఇలా సలహా ఇచ్చింది.
కరణ్ జోహార్ అతని డ్రెస్సింగ్ సెన్స్ ద్వారా ప్రభావితం కావడం మానేయాలని రణవీర్‌సింగ్ ని ట్యాగ్ చేస్తూ కంగన సలహా ఇచ్చింది. ఆ హీరో ధర్మ్ జీ (ధర్మేంద్ర) లేదా వినోద్ ఖన్నా జీ లాగా సాధారణ మనిషిలా దుస్తులు ధరించాలి... అని కంగన సూచించింది. ఓ వైపు కరణ్ ని తూట్లు పొడుస్తూనే పరిశ్రమ అగ్రహీరో రణవీర్ సింగ్‌కి కంగన గొయ్యి తవ్వింది. కరణ్-రణ్ వీర్ జోడీ `రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ` విడుదల వేళ కంగన ఇలా తీవ్ర విమర్శలు గుప్పించింది.
రణవీర్ మగాడిలా కనిపించే ఫ్యాషన్ ఎంపికలకు మారాలని కరణ్ జోహార్ సూచించే ఎంపికలకు దూరంగా ఉండాలని కూడా కోరింది. పనిలో పనిగా దక్షిణ భారత హీరోల మాదిరిగానే మరింత గౌరవప్రదమైన మేల్ గెటప్ తో కనిపించాలని రణవీర్ ని కోరింది. రణవీర్ పై కంగన ఫసక్ ఇలా ఉంది. ``తనను తాను హీరో అని పిలుచుకునే కార్టూన్‌లా కనిపించే వ్యక్తిని భారతీయులు గుర్తించలేరు. దయచేసి అందరూ సౌత్ హీరోలను చూడండి. వారు ఎలాంటి దుస్తులు ధరిస్తున్నారో.. నిజానికి అది గొప్ప గౌరవం పెంచుతుంది. సౌత్ హీరోలు చిత్తశుద్ధితో తమను తాము ఎలా ముందుకు తీసుకువెళుతున్నారో చూడండి. వాళ్లు మనుషులుగా గౌరవప్రదంగా కనిపిస్తారు. మన దేశంలో సంస్కృతిని నాశనం చేయవద్దు.. అంటూ రణవీర్ సింగ్ సహా నెపోటిజం హీరోలకు సూచించింది.
ఇటీవలే విడుదలైన కరణ్ జోహార్ సినిమా `రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ` సాధారణ ఓపెనింగులతో సరిపెట్టుకుంది. మొదటి వారాంతంలో ఈ సినిమా 50 కోట్ల వసూళ్లను సాధించలేకపోయింది. ఇది యావరేజ్ ఫలితం అంటూ ట్రేడ్ విశ్లేషిస్తోంది. కానీ 250 కోట్లు వసూలు చేయాలంటే లాంగ్ రన్ లో మాత్రమే సాధ్యమని కూడా విశ్లేషిస్తున్నారు.