Begin typing your search above and press return to search.

హీరోయిన్ గా స‌త్తా చాటిన సినిమాకి సీక్వెల్!

క్వీన్ స‌క్సెస్ కంగ‌నా ర‌నౌత్ ని బాలీవుడ్ లో ఏ స్థాయికి తీసుకెళ్లిందో చెప్పాల్సిన ప‌నిలేదు

By:  Tupaki Desk   |   27 Jun 2024 12:30 AM GMT
హీరోయిన్ గా స‌త్తా చాటిన సినిమాకి సీక్వెల్!
X

క్వీన్ స‌క్సెస్ కంగ‌నా ర‌నౌత్ ని బాలీవుడ్ లో ఏ స్థాయికి తీసుకెళ్లిందో చెప్పాల్సిన ప‌నిలేదు. అప్ప‌టివ‌ర‌కూ హీరోల‌కు జోడీగా న‌టించిన కంగ‌నా ఒక్క‌సారిగా క్వీన్ తో లేడీ ఓరియేంటెడ్ అటెంప్ట్ చేసి బాక్సాఫీస్ వ‌ద్ద సోలోగా స‌త్తా చాటింది. 23 కోట్ల బ‌డ్జెట్ లో తెర‌కెక్కిన సినిమా 90 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించింది. వికాస్ భాల్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ సినిమాకి కంగ‌న డైలాగ్ రైట‌ర్ గానూ ప‌నిచేసింది.

దీంతో బాలీవుడ్ లో కంగ‌న అంటే ఓ బ్రాండ్ గా మారిపోయింది. అమ్మ‌డితో లేడీ ఓరియేంటెడ్ సినిమాలు తీసి బాక్సాఫీస్ ని షేక్ చేయోచ్చు అన్న ధీమా నిర్మాత‌ల్లో మొద‌లైంది. అప్ప‌టి నుంచి ఎన్నో అవ‌కాశాలు వ‌స్తున్నా అమ్మ‌డు ఆచితూచి అడుగులు వేస్తోంది. క‌మ‌ర్శియ‌ల్ సినిమాలు చేస్తూనే సొంత బ్యాన‌ర్లోనూ ప‌నిచేస్తుంది. అయితే బ‌య‌ట బ్యాన‌ర్ల‌కంటే సొంత నిర్మాణంలో ఎక్కువ‌గా సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంది.

ఈనేప‌థ్యంలో తాజాగా `క్వీన్` సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు కంగ‌న హింట్ ఇచ్చింది. అయితే సీక్వెల్ ఎప్పుడు సాధ్య‌మ‌వుతుంది? అన్న‌ది మాత్రం చెప్ప‌లేదు. త‌న‌ని గొప్ప స్థానానికి తీసుకెళ్లిన చిత్రానికి సీక్వెల్ చేయాలి అన్న ఆలోచ‌నని మాత్ర‌మే పంచుకుంది. మునుప‌టి కంటే కంగ‌న ఇప్పుడు ఆర్దికంగా బాగా బ‌ల‌ప‌డింది. సొంతంగా భారీ బ‌డ్జెట్ సినిమాలు నిర్మిస్తుంది. ఈ నేప‌థ్యంలో క్వీన్ సీక్వెల్ చేస్తే భారీ ఎత్తున నిర్మించే అవ‌కాశం ఉంది.

అలాగే ఇటీవ‌లే రాజ‌కీయాల్లోకి కూడా ప్ర‌వేశించింది. బీజేపీ నుంచి ఎంపీ అభ్య‌ర్దిగానూ ఎన్నికైంది. సినిమాల‌తో పాటు రాజ‌కీయాల్ని బ్యాలెన్స్ చేయాలి కాబ‌ట్టి మునుప‌టి అంత వేగంగా సినిమాలు చేసే అవకాశం ఉండ‌దు. పైగా బీజేపీ ఈ ఐదేళ్ల ప‌ద‌వీ కాలంలో ఆమె సేవ‌ల్ని బ‌లంగా వినియోగించుకోవాల‌ని చూస్తుంది. పార్టీలో స‌ముచిత స్థానం ద‌క్క‌డంతో కంగ‌న కూడా అంతే ఉత్సాహంగా పార్టీ, ఎంపీ బాధ్య‌త‌లు నెర‌వ‌ర్తించ‌డానికి చూస్తుంది.