Begin typing your search above and press return to search.

కంగ‌న చెంప దెబ్బ వెన‌క కొత్త కోణం?

కంగనాను చెంపదెబ్బ కొట్టిన కానిస్టేబుల్ ఉద్యోగం కోల్పోతుంద‌ని కూడా ఇప్పుడు క‌థ‌నాలొస్తున్నాయి.

By:  Tupaki Desk   |   7 Jun 2024 12:37 PM GMT
కంగ‌న చెంప దెబ్బ వెన‌క కొత్త కోణం?
X

కంగనా రనౌత్ చెంప దెబ్బ దేశ‌వ్యాప్తంగా వేవ్స్ క్రియేట్ చేస్తోంది. చండీగఢ్ విమానాశ్రయంలో CISF మ‌హిళా కానిస్టేబుల్ కొత్త ఎంపీ కంగ‌న‌ను చెంపదెబ్బ కొట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది. భాజ‌పా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిరసనలు చేస్తున్న‌ రైతులపై కంగ‌న‌ చేసిన వ్యాఖ్యలపై కలత చెంద‌డం వ‌ల్ల‌నే త‌న‌ను కొట్టాన‌ని కానిస్టేబుల్ పేర్కొంది. కంగనాను చెంపదెబ్బ కొట్టిన కానిస్టేబుల్ ఉద్యోగం కోల్పోతుంద‌ని కూడా ఇప్పుడు క‌థ‌నాలొస్తున్నాయి.

అయినా కానీ, మ‌రోసారి సీఐఎస్ఎఫ్ మ‌హిళా కానిస్టేబుల్ పై కంగన మరోసారి ఎదురుదాడి చేసింది. చాలా మంది నెటిజ‌నులు కంగ‌న‌పై దాడిని ఖండించారు. కానిస్టేబుల్ పెద్ద పేరు రావాల‌ని కోరుకుంటున్నందున అలా చేసింద‌ని కొంద‌రు నెటిజ‌నులు వ్యాఖ్యానించారు. ''కంగనా రనౌత్‌పై దాడి చేసిన సిఐఎస్ఎఫ్‌ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌కు శిక్ష పడుతుంది. ఆమె ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. అందుకే ఆమె అంతా ప్లాన్ చేసి ఉండవచ్చు. రైతు నిరసనకు మద్దతు ఇవ్వడం గురించి ఇలా చేయ‌డం పూర్తిగా అర్ధంలేనిది. ఇందిరాగాంధీని హత్య చేసినందున బియాంత్ సింగ్ కొడుకు రాజ‌కీయాల్లో గెలవగలిగితే, కుల్విందర్ కౌర్ (కానిస్టేబుల్‌) కూడా రాజ‌కీయాల్లో గెలవగలదు! అంటూ ఒక‌రు సెటైర్ వేసారు.

కంగనా దీనికి ప్ర‌తిస్పంద‌న‌గా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన స్టేట్‌మెంట్ ఇలా ఉంది.. ''ఇది నాకు అర్థ‌మైంది. ఆమె నా కోసం వ్యూహాత్మ‌కంగా వేచి ఉంది. ఖలిస్తానీ స్టైల్‌తో నిశ్శబ్దంగా వెనుక నుండి వచ్చి ఆమె ఎందుకు అలా చేసిందో నేను అడిగినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా నా ముఖం మీద కొట్టింది. ఆమె దూరంగా చూసింది.. ఆమె పైకి కేంద్రీకృత‌మై ఉన్న ఫోన్ కెమెరాలతో మాట్లాడటం ప్రారంభించింది (ఆమె వీడియోలలో చూడవచ్చు). అకస్మాత్తుగా ప్రజల దృష్టిని ఆకర్షించింది.. రైతుల చట్టాలు రద్దు అయ్యాయి. వారు దేని గురించి ఆందోళన చెందరు. బహుశా రాజ‌కీయాల్లో చేరడానికి ఆమెకు ఇది ఒక‌ మార్గం. పంజాబ్‌లో ప్రధాన స్థానాలను ఖలిస్తానీ బంద్‌వాగన్ ఆక్ర‌మిస్తోంది! '' అని కంగ‌న ఎమోష‌న‌ల్ అయ్యారు.

''ఒక నిరాయుధ వృద్ధురాలి(ఇందిరాగాంధీ)ని నమ్మిన బంట్లు, యూనిఫాంలో ఉన్న వ్యక్తులు ఆమెను ఇంట్లోనే ఎలా చంపారో చూపించడానికి 'ఎమ‌ర్జెన్సీ' (కంగ‌న సినిమా) త్వరలో వస్తుంది. ఒక వృద్ధురాలిని చంపడానికి 35 బుల్లెట్లు, ధైర్యమైన ఖలిస్తానీల కథ త్వరలో బయటకు వస్తుంది'' అని కూడా కంగ‌న వ్యాఖ్యానించారు. నిజానికి కంగనా రనౌత్ ఈ చెంపదెబ్బ ఘటన కొద్దిరోజులైనా చర్చనీయాంశం అవుతుంది. ఇందిరాగాంధీ హ‌త్యోదంతం ఎమ‌ర్జెన్సీ నేప‌థ్యంలో కంగ‌న ఎమ‌ర్జెన్సీ అనే సినిమాను తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూనే, నిర్మాత‌గాను పెట్టుబ‌డులు పెడుతోంది.