ఫోటో స్టోరి: కంగన రెబలిజం
గ్లామర్ ఎలివేషన్ లోను కంగన రెబలిజం కనిపిస్తోందని కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు
By: Tupaki Desk | 30 Nov 2023 4:02 AM GMTనిరంతరం వార్తల్లో నిలవడం ఎలానో కంగనకు తెలిసినంతగా వేరొకరికి తెలియదేమో! అయితే గత కొంతకాలంగా వరస పరాజయాలతో కంగనపై నెగెటివ్ ప్రచారం మొదలైంది. కారణం ఏదైనా ఇటీవల క్వీన్ లైమ్ లైట్ నుంచి దూరంగా ఉంటోంది. ఇప్పుడు హాలిడే సీజన్ కోసం కంగనా రనౌత్ హిమాచల్‌లోని తన స్వస్థలానికి వెళ్లింది. అక్కడికి చేరుకున్న కంగనకు తన పెంపుడు కుక్క నుండి ఘన స్వాగతం లభించింది. పప్పీతో ఒక ఫోటోను షేర్ చేసుకుంటూ కంగన ఎమోషనల్ అయింది. ``నా లిల్ గర్ల్ .. శక్తివంతమైన హిమాలయాలతో తిరిగి కలుసుకున్నాను`` అని రాసింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇంతకుముందు వైరల్ అయ్యాయి. మరోవైపు కంగన ఇన్ స్టా ఫోటోషూట్ అంతర్జాలంలో దుమారంగా మారింది. ఇందులో క్వీన్ గ్లామరస్ గా కనిపిస్తోంది. బ్లాక్ కలర్ ఇన్నర్ ధరించిన కంగన సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. క్వీన్ క్రిష్ 3లో ఎంతో గ్లామరస్ గా కనిపించింది. మళ్లీ ఇప్పుడు ఫోటోషూట్ లో అంతే రసరమ్యంగా కనిపించిందంటూ ఫ్యాన్స్ కితాబిచ్చేస్తున్నారు. గ్లామర్ ఎలివేషన్ లోను కంగన రెబలిజం కనిపిస్తోందని కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. కంగనా రనౌత్ చివరిగా తేజస్‌లో కనిపించింది. IAF అధికారి తేజస్ గిల్ గా ప్రధాన పాత్రను పోషించింది. అన్షుల్ చౌహాన్, వరుణ్ మిత్రతో కలిసి ఒక భారతీయ గూఢచారిని రక్షించే అధికారిగా కంగన నటించింది. అక్టోబర్ 2023లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తదుపరి తమిళ కామెడీ-హారర్ సీక్వెల్ చంద్రముఖి 2లో కూడా కనిపించింది. ఇందులో కంగనా డ్యాన్సర్ పాత్రను పోషించింది. ఇది కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.
కంగనా రనౌత్ ఇటీవల సోషల్ మీడియాల వేదికగా చెన్నైలో తన తదుపరి చిత్రం పని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ అని వెల్లడించింది. ఇంకా పేరు పెట్టని సినిమా గురించి కంగనా పెద్దగా వివరాలు వెల్లడించలేదు. ఇది చాలా అసాధారణమైన ఉత్తేజకరమైన స్క్రిప్ట్ అని చెప్పింది. ఆ తర్వాత రోజు తనను ఆశ్చర్యపరిచేందుకు రజనీకాంత్ తన సెట్‌కి వచ్చాడని కూడా ఆమె వెల్లడించింది.
అంతే కాకుండా కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ విడుదలకు రావాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. ఎమర్జెన్సీ గురించి చెప్పాలంటే.. ఈ చిత్రం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా రూపొందింది. దివంగత రాజకీయ నాయకురాలు ఇందిరా గాంధీగా టైటిల్ పాత్రలో కంగనా కనిపించనుంది. మాజీ ప్రధాని ఇందిర 1975లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించారు. కంగనా స్వయంగా నిర్మించిన ఈ చిత్రంలో విప్లవ నాయకుడు జె పి నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిగా శ్రేయాస్ తల్పాడే, ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా పాత్రలో మిలింద్ సోమన్ నటించారు.