Begin typing your search above and press return to search.

ప‌త‌నంలోను ప‌రితోషికంలో త‌గ్గేదేలే!

రూ.8000 నుండి ప్రారంభించి 15 కోట్ల రేంజుకు ఎదగడం అన్న‌ది అన‌న్య సామాన్యం. అంటే 18,74,900 శాతం జంప్ త‌న పారితోషికంలో సాధ్య‌మైంది.

By:  Tupaki Desk   |   28 Oct 2023 4:30 PM GMT
ప‌త‌నంలోను ప‌రితోషికంలో త‌గ్గేదేలే!
X

కంగనా రనౌత్ స్టార్ డ‌మ్ ఇప్పుడు జీరోకి పడిపోయిందా? వ‌రుస ప‌రాజ‌యాలు త‌న‌కు బిగ్ షాకిస్తున్నాయా? అంటే అవున‌నే ఒక సెక్ష‌న్ విశ్లేషిస్తోది. కంగ‌న న‌టించిన‌ తాజా చిత్రం 'తేజస్' విడుద‌లైంది. ఈ సినిమా ఓపెనింగులు తీసిక‌ట్టుగా ఉన్నాయి. దీంతో మ‌రోసారి కంగ‌న ప‌ని అయిపోయింది అన్న చ‌ర్చా సాగుతోంది. తేజ‌స్ కి ప్ర‌జా తీర్పు ఏమైనప్పటికీ కంగ‌న గురించి ఇప్పుడు ర‌క‌ర‌కాల కోణాల్లో అభిమానులు చ‌ర్చిస్తున్నారు. రెండు ద‌శాబ్ధాల కెరీర్ లో కంగ‌న ఎదుగుద‌ల లేదా ప‌త‌నం గురించి ఆరాలు తీస్తున్నారు.

కొన్ని వ‌రుస ఫ్లాపుల త‌ర్వాతా కంగ‌న త‌గ్గేదేలే అంటూ నిర్మాత‌ల నుండి ముక్కు పిండి మ‌రీ వ‌సూలు చేస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది. నిజానికి గ‌త సంవ‌త్స‌రాల‌ గ్రాఫ్ ని ప‌రిశీలిస్తే.. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో కంగన ర‌నౌత్ ఒకరు. ఒక సినిమా కోసం రూ.12 - 15 కోట్ల వరకు వసూలు చేస్తారు. 'తలైవి'లో జయలలితగా తెరపై నటించడానికి ఆ చిత్రానికి 25 కోట్లు వసూలు చేసింది. చాలా ఇంటర్వ్యూలలో, కంగనా రనౌత్ ఈ చిత్రం రెండు భాషలలో చిత్రీకరించారు కాబట్టి ఇది ఒక చిత్రం కాదని పేర్కొంది. ఎప్పుడూ ఇలాంటివి రెండు సినిమాల సైజ్ అని అంది. అందుకే ఆమె చాలా తెలివిగా ఒక్కో సినిమాకు తన ధర 12 కోట్లు అని నిర్ధారిస్తూ దానికి తగ్గట్టుగా వసూలు చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2009లో క్వీన్ తన మొదటి తెలుగు సినిమా 'ఏక్ నిరంజన్' కోసం కేవలం 25 లక్షలు మాత్రమే పారితోషికంగా అందుకుంది.

అయితే కంగ‌న ప్రారంభ జీతం గురించి తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండ‌లేం. కంగనా మోడల్‌గా ప్రారంభమైంది. ఒక యాడ్ స్టంట్ కోసం మొదటి జీతం రూ. 8000 అందుకుంది. రూ.8000 నుండి ప్రారంభించి 15 కోట్ల రేంజుకు ఎదగడం అన్న‌ది అన‌న్య సామాన్యం. అంటే 18,74,900 శాతం జంప్ త‌న పారితోషికంలో సాధ్య‌మైంది. నిజానికి ఇది చాలా పెద్ద సంఖ్య. అయితే గ్యాంగ్‌స్టర్‌తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసినందుకు కంగనా రనౌత్ కి చెల్లించిన తొలి పారితోషికం ఎంతో ఎవ‌రికీ తెలియదు. కంగ‌న మొదటి పారితోషికం 'రాజ్ 2'కి అందుకుంద‌న్న ప్ర‌చారం ఉంది. ఈ సినిమాలో న‌టించినందుకు రూ.60 లక్షలు చెల్లించారు. ఆ త‌ర్వాత కంగ‌న జ‌ర్నీ గురించి తెలిసిందే. త‌ను వెడ్స్ మ‌ను స‌హా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించింది. భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న నటీమణులలో టాప్ స్టార్ గా ఎదిగింది. 15 కోట్ల పారితోషికానికి కంగ‌న ఎదిగింది అనుకుంటే, స్పష్టంగా 2600 శాతం త‌న పారితోషికం రేంజ్ పెరిగింది.

విశాల్ భరద్వాజ్ కాంబినేష‌న్ లో 'రంగూన్' కోసం కంగ‌న రూ.11 కోట్ల పారితోషికం వసూలు చేసింది. ఈ విష‌యాన్ని కంగ‌న స్వ‌యంగా ఇంటర్వ్యూలలో తెలిపింది. అయితే త‌న సినిమాలు 15 కోట్ల లోపు వ‌సూలు చేసిన‌ప్పుడు ఎంత పారితోషికం అందుకున్నారు? అని ప్ర‌శ్నిస్తే .. క్వీన్ మౌనం వహించింది. త‌ను ఫ్లాపులైన‌ప్పుడు ఎంత వసూలు చేస్తుందో ప్రపంచానికి తెలియడాన్ని ఇష్టప‌డ‌లేదు. కంగ‌న తన డిజాస్ట‌ర్ మూవీ 'ధాకడ్' కోసం సుమారు 10 కోట్లు వసూలు చేసింది. ఇటీవల విడుదలైన ఆమె చిత్రం తేజస్ కోసం 12 కోట్లు వసూలు చేసింది. తన తదుపరి ఇతిహాస చిత్రం 'సీత' కోసం వాస్తవానికి 15 కోట్లు వసూలు చేస్తోంది. కొన్ని వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత కూడా పారితోషికంలో ఇప్ప‌టికీ తానే క్వీన్ ని అని కంగ‌న నిరూపిస్తోంది.

ఇక‌పై ప‌రిస్థితేంటో క్వీన్?

క్వీన్ కంగ‌న ర‌నౌత్ ఉత్తాన ప‌త‌నాల గురించి విశ్లేషించిన వారికి అంతుచిక్క‌ని ఒక సందేహం అలానే ఉంది. కంగ‌న న‌టించిన వ‌రుస చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. పంపిణీదారులు, బ‌య్య‌ర్ల‌కు తీవ్ర న‌ష్టాల‌ను మిగిల్చాయి. అలాంటి స‌మ‌యంలో కంగ‌న పారితోషికం ఎలా అందుకోగ‌ల‌దు. జ‌యాప‌జ‌యాల్లో త‌న‌కు వాటా లేదా? అంటే ఇప్ప‌టివ‌ర‌కూ నిర్మాత‌ల ముక్కు పిండి మ‌రీ కంగ‌న వ‌సూలు చేస్తోంద‌ని కొంద‌రు అంచ‌నా వేస్తున్నారు. మ‌ణిక‌ర్ణిక‌- త‌లైవి- ధాక‌డ్ లాంటి భారీ చిత్రాలేవీ సేఫ్ ప్రాజెక్టులు కావు. వీటి వ‌ల్ల పంపిణీదారులు తీవ్రంగానే న‌ష్ట‌పోయారు. అయినా కానీ కంగ‌న త‌న పారితోషికం రేంజును త‌గ్గించ‌లేదని బాలీవుడ్ మీడియా చెబుతోంది. కానీ వ‌రుస ప‌రాజ‌యాల్లో నిర్మాత‌లు కంగ‌న ఎలా పారితోషికం ఇస్తున్నారు అన్న‌దే స‌స్పెన్స్ గా మారింది. కంగ‌న న‌టించిన తాజా చిత్రం అడ్వాన్స్ బుకింగులు లేక వెల‌వెల‌బోయింది. ఈ సినిమా ఓపెనింగ్ డే కేవ‌లం 1.25 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. నిజానికి 15 కోట్ల రేంజులో పారితోషికం అందుకునే స్టార్లు న‌టించిన సినిమాలు ఏవైనా ఓపెనింగుల‌తోనే అద‌ర‌గొట్టాలి. కానీ కంగ‌న విష‌యంలో అలా జ‌ర‌గ‌డం లేదు.